Home Entertainment Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన...

Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్‌ డేట్‌

Pic Credits: IMDB.com

Avatar 2 ott release date | జేమ్స్‌ కామెరూన్‌ విజువల్ వండర్‌ నుంచి వచ్చిన చిత్రం అవతార్‌2. మొదటి పార్ట్‌లో పండోరా గ్రహంపై ఉన్న అద్భుతాలను చూపించిన కామెరూన్‌.. ఈసారి నీటి లోపల వింత ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. అవతార్‌ వచ్చిన దాదాపు 13 ఏళ్లకు సీక్వెల్‌ వచ్చింది. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చినప్పటి నుంచి అవతార్‌ 2ను చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఎంతో అతృతగా వేచిచూశారు. ఎదురుచూపులకు తగ్గట్టుగానే క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 16న విడుదలైన చిత్రం ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. పండోరా గ్రహంలోని నీటి లోపల అద్బుతాలు, వింతైన జీవులను చూసి ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. అందుకే అవతార్‌ 2 సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన అవతార్‌ 2 ఐదు వేల కోట్లకు పైగా వసూలు చేసింది.

3D, 4DX వర్షన్‌లకు వేలల్లో టికెట్ల రేటు ఉన్నప్పటికీ ప్రేక్షకులు వెనుకాడటం లేదు. ఈ విజువల్‌ వండర్‌ను 4DX వంటి టెక్నాలజీతోనే ఆస్వాదించాలని ఎంత ఖర్చైనా థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఇక అంతంత డబ్బులు పెట్టాలని ఆడియన్స్‌ మాత్రం అవతార్‌ 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. కానీ అలాంటి ఆడియన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌. ఈ సినిమా ఇప్పుడే ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అవతార్‌ 2 ఓటీటీ రైట్స్‌ను ఇప్పటికే డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుంది. అయితే అవతార్‌ రిలీజైన తేదీ నుంచి 234 రోజుల తర్వాతనే సినిమాను డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీలోకి తీసుకురానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవే నిజమైతే ఓటీటీలో అవతార్‌ చూడాలని అనుకునేవాళ్లు మరో ఆరెడు నెలలు ఆగాల్సిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Exit mobile version