Home Entertainment K. Vishwanath | కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం..

K. Vishwanath | కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం..

K. Vishwanath | ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు వ్యక్తగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధమని, అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధమని అన్నారు. ఆయనతో గడిపిన సమయం తనకు అత్యంత విలువైనదంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.

విశ్వనాథ్ గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. పండితులని పామరులని కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్ఠమైనదని చిరంజీవి కొనియాడారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు కే. విశ్వనాథ్ అన్నారు. ఆయన దర్శత్వంలో శుభ లేఖ, స్వయంకృషి, ఆపద్బాందవుడు చిత్రాల్లో నటించే అవకాశం దొరకడం గొప్ప వరమన్నారు. ప్రతి నటుడికి ఆయనతో పనిచేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిదన్నారు. విశ్వనాథ్ సినిమాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివన్నారు.

శంకరాభరణం సినిమా విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, కైలాసానికి ఏతెంచారని అన్నారు. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్ సంతాపం..

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K Vishwanath | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే. విశ్వనాథ్‌ కన్నుమూత

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

Exit mobile version