Home Entertainment K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్...

K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్ సంతాపం..

K. Vishwanath | కళా తపస్వి కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళి సై, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ మృతి బాధాకరమన్న మోదీ.. ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కే. విశ్వనాథ్ మరణం తీవ్ర విచారానికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ” తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు” అని జగన్ ట్వీట్ చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అతి సామాన్యమైన కథను ఎంచుకుని తన అద్భుతమైన ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కే. విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కే. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందన్నారు. కవి పండితులకు జనన, మరణాల భయం ఉండదని, వారి కీర్తి అజరామరం అని కేసీఆర్ పేర్కొన్నారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కళా తపస్వి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. భారతీయ సినిమా మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K Vishwanath | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే. విశ్వనాథ్‌ కన్నుమూత

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

Exit mobile version