Home Latest News Google | గూగుల్ ఆఫీసుకు బాంబు కలకలం.. కాల్ చేసి వ్యక్తి అరెస్టు

Google | గూగుల్ ఆఫీసుకు బాంబు కలకలం.. కాల్ చేసి వ్యక్తి అరెస్టు

Google | మహారాష్ట్ర పుణేలోని గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఉలిక్కిపడిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రాంగణాన్ని తనిఖీ చేయగా అది ఫేక్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మహారాష్ట్రలోని బాంద్రాలో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. పుణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు ఓ ఫోన్ వచ్చింది. ముంద్వాలోని మల్టీ స్టోర్‌డ్ కమర్షియల్ బిల్డింగ్‌లోని 11వ అంతస్తులో బాంబు ఉందని ఫోన్ రావడంతో వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఆఫీసుకు చేరుకున్న పోలీసులు. బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ లతో ప్రతి మూల తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబు దొరకలేదు. దీంతో కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరించగా హైదరాబాద్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం వెంటనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

Exit mobile version