Home Entertainment Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Jagapathi babu | ఒకప్పుడు జగపతిబాబుకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ ఉండేది. శోభన్‌ బాబు తర్వాత లేడీస్‌లో ఫుల్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు. అప్పట్లో వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్న జగపతిబాబు కెరీర్ ఒక్కసారిగా డౌన్‌ఫాల్‌ అయ్యింది. వరుస ఫ్లాపులతో దారుణమైన పరిస్థితికి వెళ్లిపోయాడు. అవకాశాల కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. దీనికితోడు ఆయన సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. బ్యాంక్‌ అకౌంట్‌లో రూపాయి లేని స్థితికి కూడా వచ్చేశాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన లెజెండ్‌ సినిమా ఆయన లైఫ్‌ను టర్న్‌ తిప్పింది. నెగెటివ్‌ పాత్రలకు ఆయన్ను కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చింది. దీంతో మళ్లీ అవకాశాలకు ఆయన ముందు క్యూ కట్టాయి. పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించుకున్నాడు. అయితే తాను పోగొట్టుకున్న ఆస్తులు, తనను మోసం చేసిన వ్యక్తుల గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

జీవితంలో కొన్ని చేదు అనుభవాలను చూడాలి. అప్పుడే మరింత బలంగా తయారవుతాం. అదృష్టవశాత్తూ అలాంటి సందర్భాలు అప్పట్లోనే ఎదురయ్యాయి అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ఆస్తుల గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. డబ్బు అనేది మనిషికి ఒక జబ్బు లాంటిదని.. ఒక పరిధి వరకు సంపాదించుకోగలగితే బాగుంటుంది కానీ.. పరిధి దాటితే టెన్షన్స్‌ తప్ప ఏమీ ఉండవని అన్నాడు. తనకు డబ్బు విషయంలో జీరో నాలెడ్జ్‌ అని తెలిపాడు. ఒకప్పుడు తాను సంపాదించుకున్న ఆస్తుల లెక్క ప్రకారమైతే ఇప్పటికి వెయ్యి కోట్లు ఉండాలని అన్నాడు. అయితే ఆ డబ్బు ఇప్పుడు ఎందుకు లేదనేది పెద్ద ప్రశ్న అని అన్నాడు. దానికి సమాధానం చెప్పడం కూడా కష్టమే అని చెప్పాడు.

‘ క్యాసినోలో డబ్బు పోగోట్టుకున్నానని చాలామంది అనుకుంటారు. కానీ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మాత్రమే క్యాసినో ఆడతాను. అది కూడా లిమిట్‌ వరకు మాత్రమే. పేకాట అస్సలు ఆడను. వాటివల్ల డబ్బు మొత్తం ఏమీ పోలేదు ‘ అని జగపతి బాబు క్లారిటీ ఇచ్చాడు. క్యాసినో ఆడటం వల్ల అయితే మొత్తం డబ్బు పోలేదని చెప్పాడు. అది వేరేవాళ్లకు ఇవ్వడం వల్ల పోయిందో.. లేదంటే ఎవరైనా మోసం చేస్తే పోయిందో.. ఆ విషయంలో క్లారిటీ లేదని చెప్పుకొచ్చాడు. ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. డబ్బులు పోవడంలో ఎవరినీ బ్లేమ్‌ చేయనని.. ఇందులో తన తప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

‘ఆస్తుల విషయంలో మాత్రం పిల్లలకు ముందే ఒక క్లారిటీ ఇచ్చానని జగపతి బాబు తెలిపారు. నా బ్యాంకు అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా లేనప్పుడు రూ.30కోట్లు ఉండి ఉంటే చాలని అనుకున్నా. లాస్ట్‌ ఇయర్ రూ30కోట్లు వచ్చేశాయి. నా లైఫ్‌లో నా పిల్లలకు అది సరిపోతుంది. వాళ్లకు అది మాత్రమే ఉందని క్లారిటీగా చెప్పా. వాళ్లు కూడా ఎప్పుడూ హై లెవల్‌లో ఉండాలని అనుకోలేదు. ఉన్నదాంట్లో హ్యాపీగా ఉంటే చాలని అనుకునేవారు’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న నవాజుద్దీన్‌ భార్య ఆలియా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Exit mobile version