Home News International Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా...

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Turkey earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం చేసింది. వరుస భూకంపాల ధాటికి రెండు దేశాలు వణికిపోయాయి. వేలాది భవనాలు కూలిపోయాయి. వేల సంఖ్యలో జనాలు మరణించారు. ఇంతటి పెను విపత్తును నెదర్లాండ్స్‌ పరిశోధకుడు ఫ్రాంక్‌ హోగర్‌ బీట్స్‌ మూడు రోజుల ముందుగానే గుర్తించాడు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. కానీ అతని మాట ఎవరూ వినిపించుకోలేదు. పైగా ఎగతాళి చేశారు. కానీ మూడు రోజుల తర్వాత అతను చెప్పినట్టే భూకంపం పెద్ద ప్రళయాన్ని సృష్టించింది. దీంతో ఫ్రాంక్‌ చెప్పిన మాట ముందే విని ఉంటే బాగుండేదని పశ్చాత్తాప పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఫ్రాంక్‌ మరో హెచ్చరిక చేశాడు. అయితే అది ఈసారి భారత్‌ గురించి కావడం గమనార్హం.

రాబోయే కొద్ది రోజుల్లో ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ కదలికలు జరిగే అవకాశం ఉందని ఫ్రాంక్‌ తెలిపాడు. ఈ కదలికలు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, హిందూ మహా సముద్రం పశ్చిమ భాగంలో ఉండే అవకాశం ఉందని అన్నాడు. ఇండియాకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. అంతేకాకుండా చైనాకి కూడా వచ్చే కొద్ది రోజుల్లో భూకంపం వచ్చే సూచనలు అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఫ్రాంక్‌ చెప్పినట్టు జరుగుతుందనే భయాలు అక్కర్లేదని పలువురు చెబుతున్నారు. భూకంపాలను కేవలం 10 సెకన్ల ముందే అంచనా వేయొచ్చని అంటున్నారు. అయితే ఫ్రాంక్‌ చెప్పింది కొట్టిపారేయలేమని.. భూకంపాలను సౌర వ్యవస్థ, వాతావరణ గణనల ఆధారంగా కూడా అంచనా వేయవచ్చని కొందరు శాస్త్రవేత్తలు సమర్థిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Exit mobile version