Home Latest News bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల...

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

bachelors | ఇది పెళ్లి కాని యువకుల ఆరాటం ! బెండకాయ ముదిరినట్టు ముదిరిపోకముందే మంచి పిల్ల దొరకాలని తాపత్రయం ! ఇంకా లేటైతే పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరామేమో భయం !! అన్ని కలగలసి పుట్టుకొచ్చింది కొత్త సంప్రదాయం !! అదే పెళ్లికాని ప్రసాదుల పాదయాత్ర. తొందరగా పెళ్లి కావాలని బ్రహ్మచారులంతా కలిసి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని మాండ్యలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మాండ్యలో పెళ్లిచేసుకుందామంటే అబ్బాయిలకు పిల్ల దొరకట్లేదు. దీంతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి యువకులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి అమ్మాయి దొరకాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 30 సంవత్సరాలు దాటిన సుమారు 200 మంది బ్రహ్మచారులు ఒక్క చోట చేరారు. వీళ్లంతా కలిసి మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు సుమారు 105 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర ఫిబ్రవరి 23న ప్రారంభమై 25న దేవాలయానికి చేరుకోవడంతో ముగుస్తుంది.
పాదయాత్ర చేపట్టడమే కాదండోయ్‌.. దీనికి బ్రహ్మచారుల పాదయాత్ర అని పేరు కూడా పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికేలా దీవించాలని మాండ్య నుంచి చామరాజనగర్‌ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి దేవతకు మొక్కులు చెల్లించనున్నారు.

మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే యువతకు వధువు దొరకడం లేదు. గతంలో ఇక్కడ భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని దాని ఫలితాన్ని ఇప్పుడు ఇక్కడి యువకులు అనుభవిస్తున్నారని స్థానిక మహిళా రైతులు చెప్తున్నారు. ఏదేమైనా పెళ్లి కోసం బ్రహ్మచారులు చేస్తున్న ఈ పాదయాత్ర దేశంలోనే తొలిసారని, చరిత్రలో ఎక్కే సంఘటన అని ఇతర ప్రాంతాల వారు అభిప్రాయపడుతున్నారు. పాపం ఆ యువకుల పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా జాలి వేస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Exit mobile version