Home News International Corona Cases | చైనాలో దారుణ పరిస్థితులు.. జనవరిలో మరణాల సంఖ్య 25వేలకు చేరే ఛాన్స్‌:...

Corona Cases | చైనాలో దారుణ పరిస్థితులు.. జనవరిలో మరణాల సంఖ్య 25వేలకు చేరే ఛాన్స్‌: బ్రిటన్‌ సంస్థ సంచలన నివేదిక

Corona Cases | చైనాలో కరోనా అదుపులోనే ఉందని, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవలే ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఒకరు చెప్పారు. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు చెబుతున్నంత దారుణ పరిస్థితి లేదని చైనా పేర్కొంది. కానీ దానికి భిన్నంగా చైనాలో పరిస్థితి ఉందని బ్రిటన్‌కు చెందిన ఓ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల డేటాను ఆ సంస్థ గురువారం వెల్లడించింది. ప్రతిరోజూ లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు చైనాలో 1.86 కోట్ల మంది కరోనా బారినపడ్డారని గణాంకాలతో సహా వివరించింది. కరోనా మరణాలు కూడా భారీగా పెరిగాయని, ఆ సంఖ్య లక్షకు చేరిందని తెలిపింది. గత వారంతో పోలిస్తే కరోనా మరణాలు ఇప్పడు రెట్టింపయ్యాయని తెలిపింది. దాదాపు రోజుకు 9 వేల మరణాలు కరోనా వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది.

వచ్చే నెలలో కరోనా కేసులు చైనాలో భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జీరో కోవిడ్‌ ఎత్తివేయడంతోనే భారీగా కేసులు పెరిగాయని ఇప్పుడు ఆంక్షలు కూడా ఎత్తివేయడంతో మరింత విజృంభించే అవకాశం ఉందని తెలిపింది. జనవరి 13 నాటికి కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరి రోజుకు 37 లక్షల వరకు నమోదయ్యే ఛాన్సుందని తెలిపింది. జనవరి 23 నాటికి మరణాల సంఖ్య 25వేలకు పెరుగుతుందని అంచనా వేసింది. ఓవరాల్‌గా చైనాలో కరోనా మరణాల సంఖ్య 5.84 లక్షలకు చేరుతుందని తన నివేదికలో పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version