Home Lifestyle Health WHO on Corona Cases | ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే ఛాన్స్‌.. ప్రపంచ...

WHO on Corona Cases | ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే ఛాన్స్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

WHO on Corona Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తొలగిపోలేదా ? మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే అవకాశం ఉందా ? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO). చైనాలో తీవ్ర స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోందని WHO ప్రతినిధి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలించారని, ఫలితంగా మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చిరించారు.

ఒకవైపు చైనాలో కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 2019 నుంచి ఉన్న ఆంక్షలన్నీ తొలగించారని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందిందని తెలిపింది. ఇది రోగ నిరోధక శక్తిని తట్టుకోవడం ఆందోళనకరమైన విషయమని కేర్ఖోవ్ అన్నారు‌. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 500 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు ఉన్నాయని, అవి వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉందని, అయితే వాటిని తట్టుకునే అస్త్రాలు కూడా ఉన్నాయని కెర్ఖోవ్‌ చెప్పడం కొసమెరుపు.

చైనా సహా ప్రపంచదేశాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వ్యాక్సిన్లు , ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లతో పాటు బెడ్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. చైనాలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version