Home Business Dream 11 | హాలీ డే నాడు ఉద్యోగులకు పనిచెప్తే లక్ష జరిమానా.. భారతీయ కంపెనీ...

Dream 11 | హాలీ డే నాడు ఉద్యోగులకు పనిచెప్తే లక్ష జరిమానా.. భారతీయ కంపెనీ కొత్త రూల్

Image Source : Pixabay

Dream 11 | హాలీ డే కదా జాలీగా గడుపుదామని ప్లాన్ చేసుకుని బయటకు వెళ్తున్న టైమ్‌లో బాస్ ఫోన్ చేసి పనిచెబితే ఏం చేస్తాం! బాస్ ఆర్డర్ వేశాక చేయకపోతే ఎలా ఉంటుంది.. అప్పటిదాకా వేసుకున్న హాలీ డే ప్లాన్స్ అన్నీ పక్కకు పెట్టి ఆఫీసుకు వెళ్లాల్సిందే. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అయినా ఆ పని కంప్లీట్ చేయాల్సిందే.ఎంత కోపం వచ్చినా.. ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆ పని కంప్లీట్ చేయాల్సిందే. లేదంటే ఉన్న జాబుకే ఎసరు వస్తుంది. కానీ ఈ విధానం ఉద్యోగుల రోజువారీ విధులపైన ప్రభావం చూపిస్తుందని తాజాగా భారతీయ కంపెనీ డ్రీమ్ 11 గుర్తించింది. అందుకే డ్రీమ్ 11 అన్‌ప్లగ్ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది.

డ్రీమ్ 11 అన్‌ప్లగ్ పాలసీలో భాగంగా సెలవులో ఉన్న ఉద్యోగులకు ఏ పని చెప్పొద్దు. ఒకవేళ ఎవరైనా ఫోన్ లేదా మెసేజ్ చేసి ఏదైనా వర్క్ చెబితే బాస్‌తో పాటు పని చెప్పిన ఇన్‌ఛార్జికి భారీగా జరిమానా విధిస్తారు. సెలవులో ఉన్న ఉద్యోగికి ఫోన్ చేసిన బాస్2కి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని డ్రీమ్ 11 కంపెనీ వెల్లడించింది. ఇది తమ కంపెనీలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపింది.

డ్రీమ్ 11 కంపెనీ ఒక ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్. 2008లో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఇందులో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ వంటి గేమ్స్‌పై బెట్టింగ్ వేసేందుకు ఈ కంపెనీ వీలు కల్పిస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

Jobs Notification | వైద్య ఆరోగ్యశాఖలో భారీ నోటిఫికేషన్‌.. 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీకి ఆమోదం

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Exit mobile version