Home Latest News TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా...

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.

కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు..

కేటగిరీలుఖాళీల సంఖ్య
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్165
మండల పంచాయతీ ఆఫీసర్126
నాయబ్ తహశీల్దార్98
ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు97
అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్63
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్59
అసిస్టెంట్ డెవలప్‌మెంతట్ ఆఫీసర్ ( టెక్స్‌టైల్స్ )38
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ )25
అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్17
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్17
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్9
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( లెజిస్లేటివ్ సెక్రటేరియట్)15
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 214
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 211
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 211
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు9
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( లా డిపార్ట్‌మెంట్ )7
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( స్టేట్ ఎలక్షన్ కమిషన్02

రేపటి నుంచి గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ

గ్రూప్ 4 పోస్టులకు డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 28 నుంచే దరఖాస్తులు స్వీకరించాల్సింది. కానీ సాంకేతిక కారణాలు తలెత్తడంతో రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు. జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 581 వార్డెన్ పోస్టుల నియామకానికి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెటర్నరీ సర్జన్ 185 పోస్టులు,హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 22 ఆఫీసర్ పోస్టులకు కూడా ప్రకటన వెలువడింది. 1392 జూనియర్ లెక్షరర్ల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది.

Read More Articles |

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Exit mobile version