Home Latest News TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2...

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Image by : www.bse.telangana.gov.in

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 783 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1 కింద 503 పోస్టులు, గ్రూప్ 4 కింద 9168 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్ష కూడా పూర్తయింది. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30కి వాయిదా పడింది. గ్రూప్‌-4 ఉద్యోగాలకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ పేర్కొన్నారు వీటితో పాటు హాస్టల్ వార్డెన్, హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి.

మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు

వ్యవసాయ శాఖతో పాటు విద్యాశాఖలో 276 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ TSPSC నోటిఫికేషన్లు జారీ చేసింది. వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 100 మల్టీ జోన్‌-1 పోస్టులు, మల్టీజోన్‌-2లో 48 పోస్టులు ఉన్నాయి. 2023 జనవరి 10 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అటు విద్యాశాఖలోనూ 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి. 2023 జనవరి 6వ తేదీ నుంచి 27 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18-44 సంవత్సరాల వయసు ఉన్న వారు దీనికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Read More Articles |

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Exit mobile version