Home Lifestyle Devotional Bath | పెళ్లయిన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Bath | పెళ్లయిన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Image by gpointstudio on Freepik

Bath | తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ముఖ్యంగా పెళ్లయిన ఆడవాళ్లు తలస్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కచ్చితంగా వాటికి అనుగుణంగానే వాళ్లు తలస్నానం చేయాలి. లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా నష్టపోతారని పెద్దలు చెబుతున్నారు.

పెళ్లయిన మహిళలు సోమ, బుధ, శనివారాల్లో మాత్రమే తలంటు పోసుకోవాలి. సోమవారం నాడు తలస్నానం చేస్తే ఆ మహిళ నిత్య సౌభాగ్యవతిగా ఉంటుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శనివారం తలంటు పోసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

మంగళ, గురు, శుక్రవారాల్లో తలస్నానం చేయకూడదు. తప్పదు అనుకుంటే మాత్రం మంగళ, శుక్ర వారాల్లో తలంటు పోసుకోవచ్చు. గురువారం నాడు తలస్నానం చేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో కూడా మహిళలు తలస్నానం చేయవద్దు.

పురుషులు ఏ రోజు తలస్నానం ( Head Bath ) చేయాలి?

  • పురుషులు సోమవారం తలస్నానం చేస్తే వారి అందం రెట్టింపవుతుంది.
  • మంగళవారం తలస్నానం విపరీత దుఖానికి కారణం అవుతుంది.
  • బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
  • గురువారం తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అప్పుల్లో కూరుకుపోతారు.
  • శుక్రవారం తలస్నానం చేయడం మంచిది కాదు. ఈ రోజు తలంటు పోసుకుంటే అనుకోని ఆపదలు ఎదురవుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version