Home News AP Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Image Source : www.tirumala.org

Tirumala | టైమ్ టు న్యూస్, తిరుపతి : తిరుమలలో ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం టీటీడీ ( TTD ) ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది.

ఆనంద నిలయం బంగారుతాపడం పనులు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించిందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్ఛకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు తెలిపారు. 2023 మార్చి 1వ తేదీన బాలాలయం ఏర్పాటుకు ముహూర్తం నిర్ణయించినట్టుగా ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో బాలాలయ నిర్మాణానికి వైదిక క్రతువులు నిర్వహించి .. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళను కుంభంలోకి ఆవాహన చేస్తారని.. తర్వాత బాలలయంలో ఏర్పాటు చేసే వేంకటేశ్వరస్వామి వారి విగ్రహంలో ప్రవేశపెడతామని చెప్పారు. ఆ తర్వాతనే బంగారు తాపడం పనులు చేపడతామని వెల్లడించారు. ఈ ఆరు నెలలో సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని, బాలలయంలోని దారు విగ్రహాన్ని భక్తులు దర్శించుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. మూలమూర్తికి, దారు విగ్రహానికి అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తామని చెప్పారు.

11వ తేదీ వరకు ఆఫ్ లైన్ టికెట్లు రద్దు

శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లను శనివారం నుంచి జనవరి 11వ తేదీ వరకు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుపతి కౌంటర్లలో ఇచ్చే టైమ్‌స్లాట్ సర్వదర్శం టికెట్ల జారీని ఇవాళ, రేపు (జనవరి 1 ) నిలిపివేసింది.ఇక 2022లో దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నాడు. హుండీ కానుకలు రూ.1320కోట్లు వచ్చాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version