Home Lifestyle Horoscope & Vaasthu Vasthu Shastra | ఇంట్లో టీవీని ఆ దిక్కున పెడితే కుటుంబంలో విభేదాలు వస్తాయా?

Vasthu Shastra | ఇంట్లో టీవీని ఆ దిక్కున పెడితే కుటుంబంలో విభేదాలు వస్తాయా?

Image Source : Pixabay

Vasthu Shastra | కొన్ని వస్తువులు ఇప్పుడు నిత్యావసరాలు అయిపోయాయి. ఈ రోజుల్లో సొంతిల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే కచ్చితంగా టీవీ, ఫ్రిజ్ ఉండాల్సిందే. బెడ్, సోఫా సెట్ కూడా తప్పనిసరి వస్తువులు అయిపోయాయి. మరి వీటిని ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి. వీటికి కూడా వాస్తును పాటించాలా? అంటే అవుననే అంటున్నారు వాస్తు నిపుణులు. మరి ఇంట్లో టీవీ, ఫ్రిడ్జిని ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీని ఏ దిశలో పెట్టాలంటే..

  • టీవీని ఎప్పుడూ కూడా ఈశాన్య మూలలో పెట్టకూడదు. దీనివల్ల సానుకూల శక్తి మార్గాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది.
  • టీవీని ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. దీనివల్ల ఇంట్లో నివసించే వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. వాయువ్య మూలలో కూడా టీవీని పెట్టుకోవచ్చు.
  • ఒకవేళ టీవీని బెడ్రూంలో పెట్టుకోవాలని అనుకుంటే ఆగ్నేయ మూలలోనే ఉంచాలి. అదే బెడ్రూం మధ్యలో ఉంటే వైవాహిక జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. పడుకునేముందు టీవీ స్క్రీన్‌పై కవర్ ఉంచాలి. లేదంటే ఇంట్లో గొడవ వాతావరణం ఏర్పడుతుంది.
  • టీవీని తూర్పు గోడకు ఆనుకునే విధంగా ఉంచాలి. దీనివల్ల టీవీ చూసినంత సేపు ఇంట్లోవారు తూర్పువైపు మొహం చేసి ఉంటారు. ఇది వాస్తు ప్రకారం మంచిది.
  • ఇంటి సింహద్వారానికి ఎదురుగా టీవీని పెట్టకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుంది. ఇది కుటుంబంలో విబేధాలకు దారితీస్తుంది.
  • టీవీలో ఎప్పుడూ దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుంది.

ఫ్రిజ్, సోఫా సెట్ ఎక్కడ పెట్టాలి?

  • వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిజ్‌ను వాయువ్య లేదా ఆగ్నేయ దిశలో పెట్టాలి. తేలికపాటి ఫర్నీచర్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. పెద్ద పెద్ద ఫర్నీచర్‌ను దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. సోఫా, దివాన్‌ను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచాలి. ఇక అద్దాన్ని ఎప్పుడూ ఉత్తరం, తూర్పు దిశలో ఉంచాలి. బెడ్రూంలో అద్దాన్ని ఉంచుకోవద్దు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Exit mobile version