Home Entertainment Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక...

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Image Source :twitter

Unstoppable with NBKS2 | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దూసుకెళ్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్లతో క్రేజీ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేసింది. న్యూఇయర్, సంక్రాంతి పండుగ సమయంలో వీటిని స్ట్రీమింగ్ చేసి.. అదిరిపోయే క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. చాలామంది వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేటు లిమిటెడ్ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ దీనిపై కీలక ఆదేశాలు ఇచ్చారు. అనధికారికంగా ఈ షో వీడియోలను ప్రసారం చేయడం వల్ల తీవ్ర ప్రభావం చూపుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ టాక్ షోకి సంబంధించిన అనధికారిక స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే తొలగించాలని టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా డైనమిక్ ఇంజక్షన్ ఇవ్వకపోతే ఫిర్యాదుదారునికి భారీ నష్టం వస్తుందని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజెక్షన్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లో తొలి భాగం డిసెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రెండో ఎపిసోడ్ జనవరి 6న ఓటీటీలోకి వస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ఆహాలోకి వస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version