Home Lifestyle Devotional Laxmi Devi | శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు

Laxmi Devi | శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు

Image by Harryarts on Freepik

లక్ష్మీదేవి ( Laxmi Devi )కి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం. ఈ రోజున లక్ష్మీదేవిని నిష్టగా పూజించడం వల్ల ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అందుకే శుక్రవారం నాడు చాలామంది ఉపవాసం ఉంటారు. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్మీదేవికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. అవి ఆది లక్ష్మీ, విద్యా లక్ష్మీ. ధాన్యలక్ష్మీ, విజయలక్ష్మీ, గజలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ. శుక్రవారం నాడు ఈ అష్ట లక్ష్మీ రూపాలను పూజించాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని పెద్దలు చెబుతారు.

లక్ష్మీదేవిని ఉదయం కంటే కూడా రాత్రివేళలో పూజించడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. శుక్రవారం నాడు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య లక్ష్మీదేవి పూజ చేయడం మంచిది. ఈ రోజున శుభ్రమైన బట్టలు ధరించి పూజలో పాల్గొనాలి. ఎర్రటి వస్త్రంపై లక్ష్మీదేవి ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అలాగే శ్రీయంత్రాన్ని కూడా ఉంచాలి. తర్వాత నెయ్యి దీపాన్ని వెలిగించి.. అష్ట గంధాన్ని శ్రీయంత్రం, లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీ అష్ట లక్ష్మీయై హ్రీం సిద్ధయే మామ్ గృహె అగ్ఛగాచ నమః స్వాహా అనే మంత్రం పఠిస్తూ అష్ట లక్ష్ములను స్మరించుకోవాలి. ఇంట్లోని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గటెక్కవచ్చని పండితులు చెబుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Exit mobile version