Home Lifestyle Do you know Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో...

Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు

Pan Card Number | మీ పాన్ కార్డు నంబర్ ఏంటి? ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే చాలామంది తెల్లమొహాలు వేస్తారు. కొంతమందికి అయితే పాన్ కార్డులో ఎన్ని నంబర్లు ఉంటాయో కూడా తెలీదు. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తరహాలో కాకుండా పాన్ కార్డులో కొన్ని నంబర్లు, మరికొన్ని అక్షరాలు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీంతో పాన్ నంబర్ గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ పాన్ కార్డు ఇష్యూలో ఉన్న టెక్నిక్ తెలిస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడం అంత పెద్ద సమస్యేమీ కాదు.

పాన్ కార్డుపై 10 నంబర్లు ఉంటాయి. వీటిలో కొన్ని అంకెలు, మరికొన్ని వాటికి అక్షరాలు ఉంటాయి. అలా కేటాయించడం వెనుక ఒక లాజిక్ ఉంది. అది తెలిస్తే పాన్ నంబర్‌ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాన్ కార్డు నంబర్‌ను మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి ఐదు ఆంగ్ల అక్షరాలు, తర్వాతి నాలుగు అంకెలు, చివరలో మళ్లీ ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఎవరి పాన్ కార్డు నంబర్ అయినా సరే ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. ఈ ఫార్మాట్ వెనుక ఉన్న టెక్నిక్ ఇప్పుడు తెలుసుకుందాం..

➣ పాన్ కార్డులో మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు సిరీస్‌లో ఉంటాయి.

➣ ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి మనం ఏ విభాగానికి చెందిన వాళ్లమో నాలుగో అక్షరం తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించేవారికి P అక్షరాన్ని, కంపెనీలకు C అక్షరాన్ని కేటాయిస్తారు.

➣ ఐదో అక్షరం పాన్ కార్డు హోల్డర్ ఇంటి పేరులో మొదటి అక్షరాన్ని తెలియజేస్తుంది. కంపెనీలు, ట్రస్టులు వంటి వాళ్లకు అయితే పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది.

➣ ఆరు నుంచి తొమ్మిదో అక్షరం వరకు 0001 నుంచి 9999 వరకు కేటాయిస్తారు. చివరి నంబర్ ఎప్పుడూ ఆంగ్ల అక్షరమే ఉంటుంది.

➣నాలుగో నంబర్ విషయంలో ఇవి తెలుసుకోండి

అక్షరంఎవరికి కేటాయిస్తారు
Pవ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు
Cకంపెనీలు
Hహిందూ అవిభాజ్య కుటుంబం
Aవ్యక్తులు లేదా సంస్థల బృందం
Bవ్యక్తుల బృందం
Gప్రభుత్వ ఏజెన్సీలు
Jఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్
Lలోకల్ అథారిటీ
Fసంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ
Tట్రస్ట్


Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version