Home Lifestyle Horoscope & Vaasthu Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు...

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Vasthu shastra | ఇంటికే కాదు మనం చేసే పనులకు కూడా వాస్తు ఉంటుంది. వంట గదికే కాదు.. వండిన వంటను తినేందుకు కూడా వాస్తు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఎలా పడితే అలా కూర్చోవడం మంచిది కాదు. సరైన దిశలో కూర్చొని సరిగ్గా తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. వాస్తు నియమాలు పాటించి తినడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. లేదంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలాగే భోజనాన్ని అన్నపూర్ణ దేవీతో పోలుస్తారు. కాబట్టి దేవతల దిక్కుగా అభివర్ణించే తూర్పు దిక్కు మొహం చేసి తినడం మంచిది. దీనివల్ల రుణబాధలు తొలగిపోతాయి. తూర్పు దిశకు అభిముఖంగా కూర్చొని భోజనం చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. తూర్పు దిక్కు తిరిగి భోజనం చేయడం మంచిదని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు.

పశ్చిమ దిశగా కూర్చొని తినడం వల్ల ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వ్యాపారం చేసేవారు, ఉద్యోగులు ఈ దిశగా కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా పురోగతి చెందుతారు. ఉత్తరాభిముఖంగా కూర్చోని భోజనం చేయడం వల్ల మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది

ఉత్తర దిశ జ్ఞానం, సంపద, ఆధ్యాత్మికతకు సంకేతంగా పరిగణిస్తారు. కాబట్టి విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లు ఉత్తరాభిముఖంగా కూర్చొని తినడం మంచిది. కెరీర్‌ తొలి దశలో ఉన్నవారు కూడా ఈ దిక్కుకు తిరిగి భోజనం చేయడం వల్ల పురోగతి సాధిస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం వైపు మొహం చేసి ఎప్పుడూ ఆహారం తినకూడదు. దక్షిణాభిముఖంగా కూర్చొని ఆహారం తినడం వల్ల అశుభ ప్రభావం పడుతుంది. దీనివల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ప్రాణహాని కలగవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Exit mobile version