Home Lifestyle Do you know New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు...

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

New Year Calender | నూతన సంవత్సరం వచ్చేస్తుంది ! ఇంకో వారం రోజుల్లో 2022కి గుడ్ బై చెప్పేసి.. 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది కొంగొత్తగా ఉండాలనే ఆశతో చాలామంది ఇప్పట్నుంచే కొత్త క్యాలెండర్‌లు కొనుక్కొని ఇంటికి తీసుకొస్తున్నారు. మీరు కూడా అలా కొత్త క్యాలెండర్‌ను కొంటున్నట్టయితే జాగ్రత్త ! క్యాలెండర్‌లో ఉన్న బొమ్మలు, దాని కలర్ కూడా మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఇంట్లో కొత్త క్యాలెండర్‌ను పెట్టే చోటు కూడా మన కుటుంబ పరిస్థితిపై ఎఫెక్ట్ చూపిస్తుందని వాస్తు ( Vaasthu ) శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి కొత్త క్యాలెండర్‌ ఎలా ఉంటే మంచిది? దాన్ని ఏ దిక్కున పెడితే అదృష్టం కలిసి వస్తుంది?

ఈ దిక్కున ఉంటే బెటర్

వాస్తు ప్రకారం కొత్త క్యాలెండర్ తీసుకొచ్చినప్పుడు దక్షిణం వైపు ఉంచకూడదు. దక్షిణం దిక్కు యమద్వారంగా చెబుతారు. కాబట్టి ఈ దిక్కున క్యాలెండర్‌ను ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి.పురోగతి ఆగిపోతుంది. అలాగే ప్రధాన ద్వారం లేదా తలుపు వెనకాల క్యాలెండర్‌ను ఉంచవద్దు. తూర్పు, ఉత్తరం, పశ్చిమం దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ఉత్తరం వైపు ఉంచడం వల్ల కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది.పడమర వైపు క్యాలెండర్ పెడితే సంపద పెరుగుతుంది. ఇంట్లోని వ్యక్తులు కూడా పురోగతి సాధిస్తారు.

క్యాలెండర్‌లో ఇవి ఉండొద్దు

క్యాలెండర్ కొనేటప్పుడు ఆకుపచ్చ, నీలం, తెలుపు, పింక్, ఎరుపు రంగుల్లో ఉండేలా చూసుకోండి. ఇవి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. దీనివల్ల అన్ని పనులు సానుకూలంగా జరిగిపోతాయి. క్యాలెండర్‌లో ఉండే ఫొటోలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి యుద్ధాలు, రక్తపాతాలు, ఎండిన చెట్లకు సంబంధించిన చిత్రాలు లేకుండా చూసుకోవాలి. నిరాశతో కూడిన ఫొటోలు క్యాలెండర్‌లో ఉండటం వల్ల మనం కూడా నిరాశకు లోనయ్యే ప్రమాదం ఉంది.గ్రీనరీ, ఫౌంటెన్, పెళ్లి ఫొటోలు వంటివి ఉన్న క్యాలెండర్ వల్ల పాజిటివిటీ పెరుగుతుందని.. దీనివల్ల బాధలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఈ తప్పు అస్సలు చేయకండి

చాలామందికి పాత క్యాలెండర్‌పై కొత్త క్యాలెండర్ పెట్టే అలవాటు ఉంటుంది. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూలతలు ఏర్పడతాయి. ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇది గత సంవత్సరపు దరిద్రాలను ఈ సంవత్సరానికి కూడా ఆహ్వానించినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొత్త క్యాలెండర్‌ను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అది చిరగకుండా చూసుకోండి. దీనివల్ల వాస్తు దోషాలు తలెత్తే అవకాశం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Exit mobile version