Home Lifestyle Devotional Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Vasthu Shastra | హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను దైవంగా భావిస్తుంటారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణలో దీన్ని ఉంచి పూజలు చేస్తుంటారు. ఇలాంటి విశిష్టమైన తులసి మొక్కను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచలేం. మరి తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి? దాని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

తులసి మొక్కను నాటేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉన్న వాయువ్య మూలలో నాటాలి. అఫ్పుడే అదృష్టం కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. తులసి కోటను తూర్పు దిక్కు నిర్మించే సమయంలో కోట అడుగు నేల కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. దక్షిణం దిక్కు నిర్మించేటప్పుడు నేల మట్టానికి సమానంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. పశ్చిమాన తులసి కోటను ఏర్పాటు చేయాలంటే నేల ఎత్తుగా లేక లోతుగా ఉండేలా చూడాలి.

ఈశాన్యం వైపు తులసికోటను ఉంచరాదు. దీనివల్ల ఈశాన్యం బరువు పెరిగి వినాశనానికి దారి తీస్తుంది. తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తులసి కోటను ఇంటి ఆవరణలో కాంపౌండ్ లోపలే ఉంచాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Exit mobile version