Home Lifestyle Do you know Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Image by pvproductions on Freepik

Vasthu shastra | హిందూ శాస్త్రాల ప్రకారం అరటి చెట్టు ( Banana Tree )ను శ్రీమహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. కానీ అదే అరటి చెట్టును ఇంట్లో పెంచుదామని అనుకుంటే మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. అదేంటి దేవునిలా కొలిచే చెట్టును ఇంట్లో పెంచడం అరిష్టమెందుకు అవుతుంది? అని సందేహం రావొచ్చు. కానీ దీని వెనుక ఓ కారణం ఉంది. నిజానికి అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవడం దోషం కాదు. దాన్ని సరైన దిక్కులో పెట్టకపోతే ఇంట్లోని మనుషులపై దాని ప్రభావం పడుతుంది. ఆ నియమాలు ఏంటో తెలియదు కాబట్టే ఇంట్లో అరటి చెట్టు పెంచకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం పాటించి అరటి చెట్టు నాటితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో చూద్దాం..

ఈ దిక్కులో అస్సలు వద్దు

అరటి చెట్టును ఇంటి వెనకాలే నాటాలి. సింహ ద్వారం ముందు అరటి చెట్టును పెంచడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం దీన్ని సింహద్వారం ముందు నాటితే సానుకూల శక్తి రావడాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ఆనందాన్ని కోల్పోతారు. వాస్తు ప్రకారం అరటి చెట్టును ఆగ్నేయ దిశలో కూడా పెంచకూడదు. పశ్చిమ దిశలో నాటినా కూడా చెడు ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఆ దిశలో అరటి చెట్టు పెంచకపోవడం మంచిది.

ఏ దిక్కున నాటాలి?

అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం శుభప్రదం. దీనివల్ల ఇంట్లో సుఖసంపదలు కలుగుతాయి. ఒకవేళ ఈశాన్యంలో కుదరకపోతే తూర్పు, ఉత్తర దిశల్లో కూడా అరటి చెట్టును నాటవచ్చు.

ఇలా చేస్తే శుభప్రదం

అరటి చెట్టులో విష్ణువు కొలువై ఉంటాడని అంటారు. అలాగే తులసి చెట్టు లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టి అరటి చెట్టు కింద తులసి చెట్టును ఉంచితే ఇద్దరి ఆశీస్సులు దక్కుతాయి. ప్రతి గురువారం అరటి చెట్టును పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. దీనివల్ల సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

లక్ష్మీ, నారాయణుల అనుగ్రహం పొందాలంటే అరటి చెట్టును ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన ఆకులను వెంటవెంటనే తొలగించాలి. చెట్టు చుట్టూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ప్రతి రోజు శుభ్రమైన నీటినే చెట్టుకు పోయాలి. బట్టలు పిండిన, గిన్నెలు కడిగిన నీటిని పోయడం అశుభం. చెట్టు దగ్గర ముళ్ల మొక్కలను పెంచవద్దు. దీనివల్ల ఇంట్లో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Exit mobile version