Home Lifestyle Horoscope & Vaasthu horoscope today | రాశి ఫలాలు ( 15-01-2023 )

horoscope today | రాశి ఫలాలు ( 15-01-2023 )

Image Source : Pixabay

horoscope today | మేషం

రుణఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలగజేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. ఉద్యోగాల్లో్ పదోన్నతులు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

వృషభం

కుటుంబ సమస్యలు ఎదురైనా సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు.వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మిథునం

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది.

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం పొందుతారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని అతిథుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వస్తు సేకరణ చేస్తారు.

కన్య

సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

తుల

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో్ ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకుసాగుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగపడుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తువులు సేకరిస్తారు.

వృశ్చికం

భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు.

ధనుస్సు

వృత్తి,వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రముఖులను కలుస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మకరం

సంఘ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. కాంట్రాక్టులు, నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన యోగం కలదు.

కుంభం

ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

మీనం

అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలదు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి వచ్చిన వార్త ఆనందం కలగిస్తుంది. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version