Home Lifestyle Devotional Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో...

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Image by wirestock on Freepik

Water in Dreams | రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని ప్రశాంతతను కలిగిస్తే.. మరిన్ని భయాందోళనలకు గురిచేస్తుంటాయి. వాటిని తలచుకుంటే కలవరం మొదలవుతుంది. కానీ ఎలాంటి కలలు వచ్చిన సరే అవి మన జీవితంలో జరగబోయే మంచి చెడులకు సంకేతాలేనని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో నీళ్లు కనబడటం కూడా భవిష్యత్‌లో జరగబోయే విషయాలకు ప్రతిబింబాలేనని పండితులు చెబుతున్నారు. అయితే అది మంచికా? చెడుకా? అనేది నీళ్లు కనబడిన విధానాన్ని బట్టి ఉంటుందని స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది. మరి నీళ్లు ఎలా కనిపిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో సముద్రం కనిపిస్తే మంచిది కాదు. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి దీన్ని అరిష్టంగా చెబుతుంటారు. దీనివల్ల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోతారు. సంఘర్షణలకు గురికావచ్చు. జలపాతాలు గుర్తింపులో మార్పును సూచిస్తుంది. జీవితంలో వచ్చే ఆటుపోటులను సూచిస్తాయి.

అదే నదిలో నీటిని చూడటం మంచికి సంకేతం. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కోరుకున్న పనులు నెరవేరతాయి. నదిలో నీరు ప్రవహిస్తున్నట్టు కనబడితే సక్సెస్‌ వస్తుందని అర్థం. కలలో నది కనబడితే ఆర్థికంగా కూడా ప్రయోజం పొందుతారు. నీటిలో తిరగడం వల్ల కాళ్లకు పాచి పట్టినట్టు కలలో వస్తే ధనలాభం ఉంటుంది. నదిలో తలపైకి ఎత్తి ఈదుతున్నట్టు కలలు వస్తే తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

కలలో వర్షపు నీరు కనిపిస్తే విజయాలు వరిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అదే వరదలు కనిపిస్తే మంచిది కాదు. చెడు వార్తలు వినాల్సి వస్తుంది. జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. వరదలు తగ్గినట్టు కలలు వస్తే కష్టాలు తీరుతాయని అర్థం. మురికి నీళ్లు కనబడినా మంచి ఫలితాలు ఉండవు.

బావిలో నీటిని చూసిన విధానాన్ని బట్టి భిన్న ఫలితాలు గోచరిస్తున్నాయి. బావిలో నీరు పొంగిపొర్లుతున్నట్టు కలలో వస్తే మంచిది కాదు. ధన నష్టం జరుగుతుంది. ఆప్తుల్లో ఒకరు మరణించే ప్రమాదం ఉంది. ఇదే కల స్త్రీకి వస్తే వైధవ్యం లేదా భర్తకి ఆపదలు కలిగే సూచన ఉంది. బావి ప్రశాంతంగా ఉండి.. నీటితో తోడుతున్నట్టు కలలు వస్తే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. బ్రహ్మచారులకు వివాహమయ్యే అవకాశాన్ని సూచిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version