Home Lifestyle Devotional Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Image Source : Pixabay

Lakshmi Devi | తులసి మొక్కను హిందువులు పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి అంశగా తులసిని కొలుస్తారు. ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు తులసిని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. అయితే తులసిని ఎలా పూజించాలి అనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తులసి పరిక్రమ నియమాలు

తులసికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆ ఇంట్లో వారంతా సుఖసంతోషాలతో ఉంటారు.

క్రమం తప్పకుండా తులసికి శుభ్రమైన నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది.

ఎప్పుడు పడితే అప్పుడు తులసికి నీళ్లు పోయకూడదు. ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాతనే నీళ్లు పోయాలి.

నీరు పోసిన తర్వాత తులసి మొక్క చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా నీటిని సమర్పించాలి.

ఒకవేళ తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇంట్లో స్థలం లేకపోతే.. నీళ్లు పోసి అక్కడే మూడు చుట్టూ తిరిగితే సరిపోతుంది.

తులసి పూజ చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమ తీసుకుని తులసిని ప్రార్థిస్తూ ఈ మంత్రం చదవాలి.

నమస్తులసి కళ్యాణి ! నమో విష్ణుప్రియే ! శుభే!
నమో మోక్షప్రదే దేవి ! నమస్తే మంగళ ప్రదే !
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ !
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యు: పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించాలి. తర్వాత అచ్యుతానందగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లు తులసి మొక్క మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మన:ప్రియే

అని తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివల్ల కర్మదోషాలు తొలగుతాయి.

తులసీదళాలు ఎలా కోయాలి?

భగవంతుడి పూజ కోసం తులసి దళాలను కోయడానికి పలు నియమాలు ఉన్నాయి. అవేంటంటే..

మంగళ, శుక్ర, ఆది వారాల్లో తులసి ఆకులను తెంపకూడదు. ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులతో పాటు సంక్రాంతి, జనన మరణ శౌచముల్లో కూడా తులసీదళాలను కోయరాదు.

ఈ నిషిద్ధ రోజుల్లో తులసి చెట్టు నుంచి రాలిన ఆకులను మాత్రమే పూజకు వాడాలి. లేదంటే ముందు రోజే ఆకులను కోసుకోవాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఇది వర్తించదు. సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం కనుక ఇక్కడి వారు తిథి, వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తులసీదళాలను కోసి పూజకు వాడవచ్చు.

స్నానం చేయకుండా, చెప్పులు వేసుకుని తులసి చెట్టును తాకకూడదు.

తులసీదళాలను ఒక్కొక్కటిగా తెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన కొసలను తెంపాలి.

తులసి చెట్టుకు పూజే పువ్వులు ( మంజరులు ) అత్యంత శ్రేష్ఠమైనవి. వీటిని కోసేటప్పడు ఆకులు తప్పనిసరిగా ఉండాలి.

తులసి ఆకులను మహిళలు కోయరాదు. పురుషులు మాత్రమే తెంపాలి.
రోజూ పూజ చేసే తులసి కోట నుంచి ఆకులను తుంచవద్దు. కావాలంటే విడిగా మరో మొక్కను పెంచుకోవాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version