Home Latest News Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్...

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Amartya Sen | వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి ఎదురులేదని అనుకోవద్దని అన్నారు. అలా అనుకోవడం కూడా పోరపాటేనని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని అయ్యే సత్తా ఉందన్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఆమె బలాన్ని కూడగట్టగలరన్న విషయం మాత్రం ఇంకా రుజువు కాలేదన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కీలకంగా వ్యవహరిస్తాయని అమర్త్యసేన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. బీజేపీకి ఎదురు నిలిచే పార్టీ లేదని భావించడం తప్పు అని తేల్చి చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎన్‌సీపీ, జేడీయూ పార్టీలో కొత్త పొత్తుల కోసం చూస్తున్నాయని అన్నారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీని ఓడించాలని చూస్తున్నాయని చెప్పారు.

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా మంచికాదనని హెచ్చరించారు. బీజేపీకి బలంతో పాటు బలహీనతులు కూడా ఉన్నాయని, మిగత పార్టీలన్ని గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకే ప్రాంతం గురించి కాకుండా జాతీయ దృక్పదంతో ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే ఇంకా బలహీనపడిందని అమర్త్యసేన్ అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vande Bharat Express | సికింద్రాబాద్ టూ విశాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు, టైం టేబుల్ వివరాలివే !!

Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్.. అప్రమత్తమైన పోలీసులు

Shashi Tharoor | కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోయే ఛాన్స్.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

TSPSC Group-1 Results | గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఎంపికైన వాళ్ల జాబితా ఇదే

Exit mobile version