Home Lifestyle Devotional Sankranti Special | సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి

Sankranti Special | సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి

Image by starline on Freepik

Sankranti Special | తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. అని మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజుల్లో సూర్య భగవానుడు ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడాలు పిలుస్తారు. ఈ పండుగ రోజు పూజలతో పాటు ఉపవాసాలు ఉండటం, దానధర్మాలు వంటివి చేస్తుంటారు. దీనివల్ల పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తారు. కాబట్టి ఈ రోజున చేసే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. కొన్ని పనులు పొరపాటున కూడా చేయవద్దు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకర సంక్రాంతి రోజు నదీ స్నానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. నదికి వెళ్లడం కుదరనప్పుడు ఓ బాటిల్‌లో నదీ జలాల తెచ్చుకుని ఇంటి వద్ద ఉన్న నీటిలో కలుపుకుని స్నానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.

సంక్రాంతి రోజు తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉంచిన, ముందురోజు ఆహారం తీసుకోకూడదు. మందు తాగకూడదు. మాంసాహారం తినకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఈ పనులు చేస్తే మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఈ రోజు ఎవరితో కూడా అనవసరంగా గొడవలు పడకూడదు. ఎవరైనా కావాలని రెచ్చగొట్టినప్పటికీ శాంతంగానే ఉండాలి. అలా కాకుండా తగాదాలు పడితే మీపై ప్రతికూలత పెరుగుతుంది. దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. పెద్దలతో మర్యాదగా ప్రవర్తించాలి.

మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన వాళ్లకు, బయటకు వెళ్లినప్పుడు, ఆలయాల వద్ద ఎవరైనా అడుక్కునే వాళ్లు వస్తే ఎంతో కొంత ఇవ్వడం మంచిది. పండుగ రోజు ఆకలి తీరిస్తే పుణ్యం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

సంక్రాంతి అంటే రైతుల పండుగ. ప్రకృతికి అనుసంధానమైన పండుగ. కాబట్టి ఈ రోజు చెట్లను నరకడం మంచిది కాదు. జీవ హింస చేయకూడదు. మాంసం తినవద్దు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version