Home Lifestyle Devotional Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Image by Harryarts on Freepik

lord ganesh in dreams | కలలు రావడం సహజం. మనం పడుకున్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి. నిద్రలేచాక వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి. అలాంటప్పుడు రాత్రి వచ్చిన ఆ కలకు అర్థమేంటనే ఆలోచనలో పడిపోతుంటారు. దానివల్ల మంచి జరుగుతుందా? లేదా కీడును హెచ్చరిస్తుందా? అనేది తెలియక అయోమయంలో పడిపోతుంటాం. కానీ స్వప్న శాస్త్రంలో వీటన్నింటికీ వివరణలు ఉన్నాయి. కలలో వినాయకుడు కనిపిస్తే ఏం జరుగుతుందనే విషయంపై కూడా స్వప్న శాస్త్రంలో ప్రస్తావన ఉంది. మరి గణేశుడు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గణేశుడు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నాలు అన్నింటికీ అధిపతి. కాబట్టి అలాంటి వినాయకుడు కలలో కనిపిస్తే అంతా మంచే జరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. విఘ్నేశుడు అన్ని ఆటంకాలను తొలగిస్తాడు కాబట్టి కలలో గణేశుడు కనిపిస్తే ఆయన అనుగ్రహం లభించినట్టేనని పేర్కొంటుంది. అలాగే తొందరలోనే శుభవార్తలు వింటారని తెలుస్తోంది.

ఏకదంతుడు కలలో కనిపిస్తే తొందరలోనే కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. లేదా జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించబోతున్నారని సూచిస్తుంది.

గతంలో ఏమైనా మొక్కులు మొక్కి మరిచిపోతే కూడా వాటిని గుర్తు చేసేందుకు కూడా గణపతి కలలో కనిపిస్తాడు. అలా గణనాథుడు కలలో కనిపిస్తే పాత మొక్కులు ఏమైనా ఉన్నాయేమో గుర్తుచేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version