Home Entertainment K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన...

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath |శంకరాభరణం రిలీజై 43 ఏళ్లు అవుతుందని ఆ సినిమాను గుర్తు తెచ్చుకున్నాడో.. తన సినీ ప్రస్థానం కళ్ల ముందు మెదిలిందో తెలియదు గానీ.. మరణించడానికి కొద్ది క్షణాల ముందు కె.విశ్వనాథ్ ఒక పాట రాయాలని పూనుకున్నారు. కుర్చీలో కూర్చొని సగం వరకు రాసేశారు. ఇంకా రాయమని మనసు చెబుతున్నా.. శరీరం మాత్రం సహకరించలేదు. అనారోగ్యం కారణంగా పాటను మధ్యలోనే ఆపేసి కొడుకు చేతికి అందించారు. మిగిలిన పాటను పూర్తి చేయమని తన బాధ్యతను అప్పగించారు. కొడుకు పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే కె.విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. కంగారుపడిన కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన కాసేపట్లోనే కన్నుమూశారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్ ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారు. అందులో మరిచిపోలేని సినిమా శంకరాభరణం. ఒక్క స్టార్ నటుడు కూడా లేకుండా తీసిన ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది. జనాలంతా పాశ్చాత్య సంగీతంవైపు చూస్తున్న తరుణంలో ఈ సినిమాతో వాళ్ల ధ్యాసను తిరిగి శాస్త్రీయ సంగీతంవైపు మరల్చారు. అంత గొప్ప సినిమా నేటితో 43 ఏళ్లు పూర్తవుతుంది. కానీ శంకరాభరణం రిలీజైన ఈ రోజే కళాతపస్వి శివైక్యం కావడం విచారకరం. విశ్వనాథ్ మరణానికి కొద్ది క్షణాల ముందు కూడా కళామతల్లి సేవలోనే తరించారు. ఇన్నేళ్లు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఒక్కసారి స్మరించుకున్నారు. తన బాధ్యతను కొడుకు చేతికందించి తుదిశ్వాస విడిచారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version