Home Business Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Bao missing | చైనాకు చెందిన ప్రముఖ బ్యాంకర్ కనిపించకుండా పోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చైనాలో ప్రఖ్యాత రినయసెన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ బావో ఫాన్ ఆచూకీ లేకుండా పోయారు. ఆయనకి సంబంధించిన సమాచారం ఎక్కడా కూడా లభించడం లేదని కంపెనీ కాంగ్ స్టాక్ ఎక్స్ చేంజ్ ఫైలింగ్ లో వివరించారు.

చైనాలోని దీదీ, మిటువాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన బ్యాంకర్లలో బావో కూడా ఒకరని తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీలో బావోకు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఒప్పందాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక్కసారిగా బావో కనిపించడం లేదనే వార్త బయటకు రావడంతోనే ఆ కంపెనీకి చెందిన షేర్లన్ని కుప్పకూలాయి. చైనా ప్రభుత్వం వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాల మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బావో కనిపించకుండా పోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బావో కనిపించకుండా పోయి ఇప్పటికి ఎన్ని రోజులు అయ్యింది అనేది సంస్థ తెలపలేదు. కానీ ఆయన గత బుధవారం నుంచి తన సహచరులకు అందుబాటులో లేరని మాత్రం తెలుస్తోంది.

బావో రినయసెన్స్ సంస్థను 2005లో నెలకొల్పారు. ప్రస్తుతం చైనాలో టాప్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. మరి దీని స్థాపకుడు కనిపించకుండా పోవడంతో మార్కెట్లో దీని విలువ కూడా కోల్పొతున్నట్లు సమాచారం. టెక్‌ వ్యాపారాలు, వాటి యజమానుల మీద చైనా విరుచుకుపడటం మొదలయ్యాక ఈకామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా కూడా గతంలో కనిపించకుండా పోయారు. ఇప్పుడు బావో కూడా అదృశ్యమవ్వడంతో చైనాలో ఆందోళన కలిగిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Exit mobile version