Home Entertainment Vinaro bhagyamu vishnu katha | కిరణ్ అబ్బవరం చెప్పిన విష్ణు కథ ఎలా ఉంది.....

Vinaro bhagyamu vishnu katha | కిరణ్ అబ్బవరం చెప్పిన విష్ణు కథ ఎలా ఉంది.. సార్ తాకిడి తట్టుకుంటుందా..?

Vinaro bhagyamu vishnu katha | శివరాత్రి సందర్భంగా కొత్త సినిమాలు థియేటర్లలో క్యూ పడుతున్నాయి. కాకపోతే అందులో స్టార్ హీరోలు ఎవరూ లేరు. అన్నీ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే ఈ మూడు వారాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారం అయితే శివరాత్రి సందర్భంగా అరడజన్ వరకు సినిమాలు థియేటర్స్ లో దండయాత్ర చేస్తున్నాయి. అందులో అందరి దృష్టి ధనుష్ సార్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే విడుదలైన దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.

మరోవైపు శివరాత్రి రోజు విడుదలవుతున్న వినరో భాగ్యము విష్ణు కథపై కూడా కొద్దిగా ఆసక్తి ఉంది. దానికి కారణం గీతఆర్ట్స్ 2. ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. కచ్చితంగా కథాబలం ఉన్న సినిమాలు మాత్రమే బన్నీ బాస్ చేయించుకుంటాడు అని ఆడియన్స్ లో ఒక అంచనా అయితే ఉంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్ హైదరాబాదులో చాలా చోట్ల పడ్డాయి. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన వినరో భాగ్యము విష్ణుకథకు టాక్ అయితే ఓకే అన్నట్లే వచ్చింది.

ముఖ్యంగా సినిమాలో కథ కంటే ట్విస్టులు ఎక్కువైపోయాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండాలి అన్నట్లు అడుగడుగునా కథలో ట్విస్టులు రాసుకున్నాడు దర్శకుడు మురళీ కిషోర్. అవి అక్కడక్కడ బోర్ కొట్టిస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఈ వీకెండ్ హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంది అంటున్నారు ప్రేక్షకులు.

ఎస్ఆర్ కళ్యాణమండపం తర్వాత సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథతో హిట్టు కొట్టేలాగే ఉన్నాడు అంటున్నారు విశ్లేషకులు కూడా. అయితే ధనుష్ సార్ సినిమాతో ఇది ఎంతవరకు పోటీ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యావరేజ్ టాక్ తో కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం సార్ దూకుడు కనిపిస్తుంది. శివరాత్రి వీకెండ్ కావడంతో కచ్చితంగా ఈ మూడు రోజులు ధనుష్ దండయాత్ర ఖాయం. మరి దీన్ని కిరణ్ అబ్బవరం ఎంతవరకు అడ్డుకుంటాడు అనేది ఆసక్తికరమే. ఈ సినిమా హిట్ కావాలంటే 5 కోట్ల షేర్ రావాలి మరి వస్తుందా లేదా అనేది చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Exit mobile version