Home Entertainment Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Actor Nandu | సింగర్ గీతామాధురి భర్త, నటుడు నందూ ప్రమాదానికి గురయ్యాడు. అతని కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. కుడి కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్నాడు.. అయినప్పటికీ తన తాజా సినిమా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకు వచ్చాడు. ఈ సందర్బంగా డబ్బింగ్ స్టూడియోలో ఫొటోలు దిగాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. దాంతో నందూకు యాక్సిడెంట్‌ అయినట్లు అందరికీ తెలిసింది.

నందూకి ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం మాత్రం తెలియలేదు. ప్రస్తుతం నందూ క్రికెట్‌ కామెంటరీ, సినిమాలు అంటూ బిజీబిజీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన జరిగింది. అయితే నందు మాత్రం ఇదేమీ పెద్ద ప్రమాదం కాదన్నట్టుగా లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. డబ్బింగ్ స్టూడియోలో ఎంతో కూల్‌గా కనిపించాడు. అందుకే ఆయన అభిమానులు కూడా అంతగా కంగారు పడటం లేదు. కానీ ఏం జరిగిందంటూ కామెంట్లలో అడిగేస్తున్నారు.

నందూకి టాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ ఉంది. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్లు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సవారి చిత్రంతో ఓ మోస్తరు హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌తో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా చేశాడు. ఈ సినిమాను తన భుజానికి ఎత్తుకుని మరీ ప్రమోట్ చేశాడు. కానీ ఈ సినిమా మాత్రం ఏ రకంగానూ వర్కవుట్ కాలేదు. అటు కమర్షియల్ హిట్‌గానూ నిలవలేకపోయింది. ఇటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకోలేకపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Exit mobile version