Home Entertainment Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Koratala Siva | సినిమా ఇండస్ట్రీ అంత దారుణమైన ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటే నమ్మడానికి కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఇక్కడ మనుషులు మాట్లాడరు.. కేవలం విజయాలు మాత్రమే మాట్లాడతాయి. ఓ దర్శకుడు మంచి హిట్స్ లో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అదే వేదం. కానీ అదే డైరెక్టర్ కు ఒక ఫ్లాప్ వచ్చిందంటే ప్రతి ఒక్కడు ఆయన గురించి మాట్లాడే వాడే. అందరి దృష్టిలో ఆయన చులకనగా మిగిలిపోతాడు. తాజాగా కొరటాల శివ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.

మిర్చి సినిమాతో దర్శకుడుగా మారిన ఈయన.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ ఇన్ని సినిమాలు తీసుకొచ్చిన క్రేజ్ ఆచార్య అనే ఒకే ఒక సినిమా తీసుకెళ్లిపోయింది. గతేడాది చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆచార్య.. ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా 60 కోట్లకు పైగా నష్టాలు తీసుకురావడంతో కొరటాల శివకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పైగా ఆచార్య ఫలితం పూర్తిగా దర్శకుడి వైఫల్యం అంటూ చిరంజీవి పదే పదే చెప్పాడు.

అతను ఏం చెప్తే అదే చేశాం.. ఫలితం కూడా ఆయనకే సొంతం అంటూ ఇన్ డైరెక్ట్ గా కొరటాలపై సెటైర్ల వర్షం కురిపించాడు చిరంజీవి. దాంతో ఇప్పుడు కచ్చితంగా తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు కొరటాల శివ.
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు ఈయన. ఏడాదిగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా చేసుకున్న కొరటాల మార్చి నుంచి సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నాడు కొరటాల. ఇప్పటివరకు ఈయన చేసిన 5 సినిమాల్లోనూ మెసేజ్ ఉంటుంది. కథ కమర్షియల్ పద్ధతిలో చెప్పిన కూడా అండర్ కరెక్టుగా ఒక సందేశం ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు కొరటాల.

కానీ తారక్ సినిమాలో మాత్రం అలాంటి సందేశాలు ఉండవు. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా.
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. పైగా కెరీర్ లో ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమా కోసం షూటింగ్ మొదలు పెట్టక ముందే హీరో హీరోయిన్ తో ఫోటోషూట్ పూర్తి చేశాడు కొరటాల. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది.

భారీ పారితోషికం ఇచ్చి ఈమెను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్న కొరటాల షూటింగ్ కోసం మాత్రం చాలా తక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నాడు. మార్చిలో మొదలుపెట్టి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2024 ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

మొత్తానికి సరికొత్త ప్లానింగ్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు కొరటాల. మరి ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలని ఈ సినిమాతో ఆయన ఎంతవరకు చెరిపేస్తాడు అనేది చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Exit mobile version