Home Entertainment Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Kalyanram | కొందరి కెరీర్ ఊహించినట్టు అస్సలు ఉండదు. ఎంత కష్టపడినా విజయం మాత్రం వాళ్లకు అంత ఈజీగా దక్కదు. ఆ లిస్టులో నందమూరి కళ్యాణ్ రామ్ అందరికంటే ముందు ఉంటాడు. పాపం 20 సంవత్సరాలుగా ఈయన స్టార్ హీరో అనిపించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు కోరుకున్న మార్కెట్ అయితే రాలేదు. అప్పుడప్పుడు వచ్చే విజయాలు తప్ప వరుస విజయాలు ఈయన అందుకున్నది లేదు. ఇప్పటికీ విజయాల పరంగా స్థిరత్వం లేని కెరీర్ కళ్యాణ్ రామ్ సొంతం. ఒక్క హిట్టు వచ్చిందంటే దాదాపు 5-6 సంవత్సరాల వరకు మరో హిట్టు కొట్టలేడు ఈయన. కెరీర్ మొదటి నుంచి ఇదే జరుగుతుంది. దానికి తోడు ప్రయోగాలు చేయడంలో కళ్యాణ్‌ రామ్‌ ఎప్పుడు ముందుంటాడు. అది కూడా ఆయన కెరీర్‌కు కాస్త బ్రేకులు వేస్తోంది. తాజాగా అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మరోసారి నిరాశపరిచాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఐడియా కొత్తగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే పాతగా ఉండడంతో సినిమా డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమా కూడా రిస్క్ తో కూడుకున్న పనే. డెవిల్ సినిమాతో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. స్వతంత్రానికి పూర్వం జరిగే గన్ డీలర్ కథ ఇది.

ఇది కూడా రొటీన్ కి భిన్నంగా ఉండే కథ. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతానని నమ్మకంగా చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. ఆ స్టోరీ అంత బలంగా ఉంటుంది అంటున్నాడు. అయితే కథలు కొత్తగా ఉండడం వేరు.. వాటిని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం వేరు.. ఈ విషయంలో కళ్యాణ్ రామ్ దర్శకులు ఎందుకో విఫలమవుతున్నట్టు అనిపిస్తుంది. స్టోరీ సెలక్షన్ పరంగా చాలా జాగ్రత్తగా ఉన్న నందమూరి వారసుడు.. అది స్క్రీన్ మీద ఎక్కే సమయంలో మాత్రం అంత జాగ్రత్తగా లేడు. కళ్యాణ్ రామ్ కెరీర్ కు డెవిల్ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ ఆయన కెరీర్ దాడిన పడుతుంది. లేదంటే మళ్లీ నెక్స్ట్ హిట్టు కోసం చెకోర పక్షిలా వేసి చూడాల్సిందే. చూడాలిక ఈసారి రిస్క్ అయిన కళ్యాణ్ రామ్ కు విజయం తీసుకొస్తుందో లేదో.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Exit mobile version