Home Entertainment Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Roshan Meka | కొందరు హీరోలు తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ లిస్టులో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా ఉన్నాడు. నిజానికి ఏడేళ్ల కింద అన్నపూర్ణ బ్యానర్‌లో అక్కినేని నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో ఈయన హీరోగా పరిచయమయ్యాడు. కాకపోతే అప్పుడు ఇంకా స్కూల్ ఏజ్ లోనే ఉండటంతో.. దాన్ని మొదటి సినిమాగా పరిగణించవద్దు అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. అలా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రెండు సంవత్సరాల కింద పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయి హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. ఆ సినిమా నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా మంచి విజయం సాధించింది. దాదాపు 8 కోట్ల షేర్ వసూలు చేసిన నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది పెళ్లి సందడి సినిమా.

పెళ్లి సందడి సినిమాతోనే పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా మారిపోయింది. అయితే ఆ సినిమా హీరో రోషన్ మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాను విడుదల చేయలేకపోయాడు. కనీసం ఈయన ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఈయన రెండో సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్దగా చర్చ జరగడం లేదు. బయటకు వార్తలు వచ్చింది కూడా లేదు. అయితే రోషన్ రెండో సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. అశ్వనీదత్ నిర్మాణంలో కొత్త దర్శకుడు చెప్పిన కథను మెచ్చి.. దాదాపు 30 నుంచి 40 కోట్ల భారీ బడ్జెట్ తో రోషన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

స్వతంత్రానికి పూర్వం జరిగే కథ ఇది. ఇందులో రోషన్ గన్ డీలర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథతో తిరిగి కొన్ని పోలికలు ఉన్నాయనే ప్రచారం ఇండస్ట్రీలో బలంగా జరుగుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో రోషన్ మార్కెట్ భారీగా పెరుగుతుందని నమ్ముతున్నాడు శ్రీకాంత్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. 2023లోనే రోషన్ రెండో సినిమా విడుదల కానుంది. ఇది గాని హిట్ అయిందంటే శ్రీకాంత్ కొడుకు హీరోగా సెటిల్ అయిపోయినట్టే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Exit mobile version