Home Latest News Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్...

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Chetan Sharma | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒకరంటే ఒకరికి పడదు. ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్తో లేకున్నా ఇంజెక్షన్లు తీసుకొని బరిలోకి దిగుతారు. సౌరవ్ గంగూలీకి కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్నాయి. కొంత మంది ఆటగాళ్లు తరచూ నా ఇంటికి వచ్చి పోతూ ఉంటారని’’ ఓ చానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని వెల్లడించిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా విఫలమైన సమయంలో భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మొత్తం సెలెక్షన్ కమిటిని రద్దు చేసింది. ఆ తర్వాత తిరిగి ఒక్క చేతన్ శర్మను మాత్రమే చీఫ్ సెలెక్టర్గా కొనసాగించింది. బోర్డులో అంతటి కీలక పదవిలో ఉన్న ఈ మాజీ క్రికెటర్ తప్పుడు వ్యాఖ్యలతో పదవీచిత్యుడయ్యాడు. స్ట్రింగ్ ఆపరేషన్తో బీసీసీఐ పరువు పోయిన నేపథ్యంలో శుక్రవారం చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. తన లేఖను బోర్డు కార్యదర్శి జై షాకు పంపగా.. అనూహ్యంగా ఆమోదం లభించింది. దీంతో చేతన్ శర్మ స్థానంలో భారత మాజీ క్రికెటర్ శివసుందర్ దాస్కు బీసీసీఐ తాత్కాళిక చీఫ్ సెలక్టర్గా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో రెండు మ్యాచ్ల కోసమే జట్టు ఎంపిక జరుగగా.. మిగిలిన రెండు మ్యాచ్ల కోసం దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది.

కొంప ముంచిన స్ట్రింగ్ ఆపరేషన్..

వన్డే ప్రపంచకప్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కిన చేతన్ శర్మ.. ఒక జాతీయ చానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో రహస్య సమాచారాన్ని వెల్లడించాడు. టీమ్ అంతర్గత విషయాలను బయటపెట్టి రచ్చకెక్కాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయన్న చేతన్ శర్మ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గతంలో వీరిద్దరి మధ్య సఖ్యత కొరవడిందనేది వాస్తవమే అయినా.. సెలెక్షన్ కమిటీ చీఫ్గా చేతన్ అలాటి వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ మధ్య సఖ్యత లేదనే విషయం కూడా చర్చనీయాంశమైంది. ఇక ప్రధానంగా ఆటగాళ్లు ఫిట్నెస్ లేకుండానే మ్యాచ్లు ఆడుతారని చెప్పడం.. మొత్తం జట్టు నిబద్దతనే ప్రశ్నించేలా పరిణమించింది. కొందరు ఆటగాళ్లు 80-85 శాతం ఫిట్నెస్తోనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు అని పేర్కొనడంతో చేతన్ శర్మ కూర్చున్న కొమ్మనే నరుక్కున్నౖట్లెంది. పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు కనిపించేందుకు ఆటగాళ్లు ఇంజెక్షన్ (ఉత్పేరకాలు) తీసుకుంటారని చేతన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌరవ్ గంగూలీతో సఖ్యతతో లేనందుకే కోహ్లీ కెప్టెన్సీ పోయిందని.. దాదాకు రోహిత్ అంటే ఇష్టమని కూడా చేతన్ స్ట్రింగ్ ఆపరేషన్లో వెల్లడించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా తరచూ తన ఇంటిక వచ్చిపోతుంటారని చేతన్ పేర్కొన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Exit mobile version