Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsXiaomi First Electric Car | స్మార్ట్‌ఫోన్ల కంపెనీ జియోమి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.....

Xiaomi First Electric Car | స్మార్ట్‌ఫోన్ల కంపెనీ జియోమి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. స్వయంగా టెస్ట్‌ డ్రైవ్‌ చేసిన సీఈవో

Xiaomi First Electric Car| రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలదే హవా ! ఇప్పుడంటే ఎలక్ట్రిక్‌ వాహనాల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటి మార్కెట్‌ కాస్త డౌన్‌ అయ్యిందేమో కానీ.. త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధన కొరత ఏర్పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు భవిష్యత్తును ఏలుతాయని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోకి దిగుతున్నాయి.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగంలోకి ప్రవేశించేందుకు స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ జియోమీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొడెనా ఈవీ సీడాన్‌ కారును తయారు చేసిన జియోమీ.. చైనాలోని మంచు రోడ్లపై పరీక్షించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జియోమీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్‌ న్యూ ఈ కారును నడుపుతున్న ఫొటోలు కొన్ని నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫొటోల్లో కనిపించిన దాని ప్రకారం ఈ కారు చూడ్డానికి క్లాస్‌ లుక్‌లో ఉంది. ఈ కారుకు లైడార్‌ సెన్సార్‌ ఉందని.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌, ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ ద్వారా పనిచేస్తుందని పలు నివేదికల్లో తెలుస్తోంది. అయితే ఈ కారు గురించి ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది.

జియోమీ మాత్రమే కాదు ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఇంకా చాలా మొబైల్‌ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. సోనీ, యాపిల్‌, ఒప్పో కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాయి. 2026 వరకు యాపిల్‌ కంపెనీ కూడా కొత్త ఈవీ కారును ప్రవేశపెడుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

HOP Leo | ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. లక్షలోపే వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Hyundai grand i10 | తక్కువ ధరకే కారు కావాలా? 6 లక్షల లోపే వస్తున్న ఈ కారుపై ఓ లుక్కేయండి

Maruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్ అమౌంట్ రెట్టింపు చేసేసిన మారుతి సుజుకీ

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News