Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsMaruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్...

Maruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్ అమౌంట్ రెట్టింపు చేసేసిన మారుతి సుజుకీ

Maruti Suzuki Jimny | మారుతి సుజుకీ నుంచి కొత్తగా వస్తున్న జిమ్నీకి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించిన 5 డోర్ కారుకు ఫస్ట్ డే నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆటో ఎక్స్‌పో‌లో ఈ కారును ఆవిష్కరించినప్పటి నుంచే ఈ SUV కారుకు బుక్సింగ్‌ను స్వీకరించడం స్టార్ చేసింది మారుతి సుజుకీ. తక్కువ ధరలో వస్తుండటం.. లుక్ కూడా బాగుండటంతో జనాలు ఈ కారు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముందస్తుగా ఈ కారును సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే 3వేలకు పైగా బుక్సింగ్స్‌ అయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ కనిపించడంతో మారుతి సుజుకీ బుకింగ్ అమౌంట్‌ను పెంచేసింది.

ముందు జిమ్నీ బుకింగ్ అమౌంట్ రూ.11 వేలు ఉండగా.. దానిపై రూ.14వేలు పెంచేసింది. అంటే ఇప్పుడు కొత్తగా జిమ్నీని బుక్ చేసుకోవాలంటే రూ.25వేలు చెల్లించాల్సిందే. అంటే ఇది రెండింతల కంటే చాలా ఎక్కువ. ఇంత అమౌంట్ పెంచినప్పటికీ జిమ్నీకి రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదంట. జిమ్నీ హవా ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో దీని బుకింగ్ అమౌంట్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా ఈ కారును బుక్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న నెక్సా డీలర్స్ దగ్గరకు వెళ్తే సరిపోతుంది.

ప్రస్తుతం జిమ్నీ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. మోడల్ లైనప్ జీటా, అల్పా అనే రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఏ కలర్ కారు అయినా సరే రూప్ మాత్రం బ్లాక్ కలర్‌లోనే ఉండనుంది. దీని డిజైన్ విషయానికస్తే ఇందులో హెడ్ ల్యాంప్‌లు, బ్లాక్ కలర్ బంపర్‌లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్, స్లైడింగ్ రేర్ విండో వంటివి ఉన్నాయి. ఇందులో రెండు కెప్టెన్ సీట్లు, వెనుక వైపు ముగ్గురు ప్రయాణికులకు ఒక బెంచ్ టైప్ సీట్ ఉంటుంది.

ఫీచర్ విషయానికొస్తే జిమ్నీలో 9 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఎంఐడీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫ్రంట్, రేర్ వెల్డెడ్ టూ హుక్స్, ఫ్రంట్ రేర్ సీట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, స్క్రాచ్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. జిమ్నీ ఎస్‌యూవీ విశాలంగా ఉంటుంది. పొడవు 3985 మిల్లీమీటర్లు, వెడల్పు 1645 మిల్లీమీటర్లు, ఎత్తు 1720 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News