Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsHyundai grand i10 | తక్కువ ధరకే కారు కావాలా? 6 లక్షల లోపే వస్తున్న...

Hyundai grand i10 | తక్కువ ధరకే కారు కావాలా? 6 లక్షల లోపే వస్తున్న ఈ కారుపై ఓ లుక్కేయండి

Hyundai grand i10 | తక్కువ ధరలో కారు కొనాలని అనుకుంటున్నారా? రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలోనే ఏదైనా మంచి కారు వస్తే బాగుంటుందని భావిస్తున్నారా? తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో హ్యుందయ్‌ కంపెనీ ఓ కారును తీసుకొచ్చింది. కొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా లాంఛ్‌ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.5.69 లక్షలుగా నిర్ణయించింది. కాగా గరిష్ఠ ధర రూ.8.46 లక్షలుగా నిర్ణయించారు.

గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను ఇప్పటికే హ్యుందయ్‌ కంపెనీ ప్రారంభించింది. రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు. గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారు ప్రస్తుతం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్‌, ఆస్టా ట్రిమ్స్‌లో ఈ కారు లభిస్తుంది. పోలార్‌ వైట్‌, టైటాన్‌ గ్రే, టైఫూన్‌ సిల్వర్‌, టీల్‌ బ్లూ, ఫైరీ రెడ్‌ కలర్‌, స్పార్క్‌ గ్రీన్‌ కలర్స్‌లో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో గత మోడల్స్‌తో పోలిస్తే ముందు బంపర్‌ డిజైన్‌ మారింది. గ్రిల్‌తో బ్లాక్‌ కలర్‌లో దీని డిజైన్‌ ఉంది. ఇంటీరియర్‌ డిజైన్‌ విషయానికొస్తే గత మోడల్‌లో మాదిరిగానే ఉంటుంది. అదే 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఈ కారులో కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లే, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, స్మార్ట్‌ కనెక్టివిటీ, వాయిస్‌ రికగ్నైజేషన్‌, అలాగే వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

భద్రతా ప్రమాణాల విషయంలో గత మోడల్స్‌ కంటే కూడా ఇది చాలా మెరుగ్గా ఉంది. ఇందులో నాలుగు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉన్నాయి. టాప్‌ మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ వస్తున్నాయి. అలాగే ఏబీఎస్‌, ఈబీడీ బ్రేకింగ్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. మైలేజీ విషయానికొస్తే లీటర్‌కు 20.70 కిలోమీటర్లు వస్తుంది. సీఎన్‌జీ అయితే ఒక కేజీకి 27.30 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

HOP Leo | ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. లక్షలోపే వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Maruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్ అమౌంట్ రెట్టింపు చేసేసిన మారుతి సుజుకీ

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News