Saturday, January 28, 2023
- Advertisment -
HomeBusinessmaruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

maruti suzuki | పండుగపూట షాకింగ్ న్యూస్. సామాన్యులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న మారుతి సుజుకీ తమ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. అన్ని మోడల్‌పై దాని వేరియంట్‌కు అనుగుణంగా ధరలను 1.1 శాతం పెంచింది. సోమవారం నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని మారుతి సుజుకీ సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

మిగిలిన కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకు వాహనాలను అందిస్తున్న మారుతి సుజుకీ కంపెనీ కొత్త కొద్దిరోజులుగా ఖర్చులు తగ్గించుకునేందుకు కృషి చేస్తోంది. కస్టమర్లపై భారం పడకుండా ఈ ఖర్చులను తగ్గించుకోవాలని మారుతి సుజుకీ సంస్థ భావించింది. కానీ ద్రవ్యోల్బణం కారణంగా ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కార్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరం ప్రారంభంలోనే తమ కార్ల ధరలను పెంచనున్నట్టు డిసెంబర్ నెలలోనే మారుతి సుజుకీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు పెరిగిన ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొంతకాలంగా టాటా మోటార్స్, మహింద్రా కంపెనీ నుంచి మారుతి సుజుకీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలకు ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో ఎక్కువగానే ఉంది. కేవలం చిన్న కార్లపైనే ఆశలు పెట్టుకోవడంతో ఎస్‌యూవీ అమ్మకాల్లో మారుతి సుజుకీ వెనుకంజలోనే ఉంది. దీంతో ఇప్పుడు చిన్న కార్లతో పాటు ఎస్‌యూవీలపైనా మారుతి సుజుకి దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే బ్రెజా, గ్రాండ్ విటారాలతో పాటు మరిన్ని ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే 5 డోర్‌ జిమ్నీ, ఫ్రాంక్స్‌ వంటి మోడల్స్‌ ను ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించింది. ఇవి త్వరలోనే భారత్‌ రోడ్ల మీద పరుగులు పెడతాయని అంచనా.

దేశంలోని ప్రముఖ ఆటో సంస్థలన్నీ.. ఒక్కొక్కటిగా వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఈ జాబితాలోకి అతి త్వరలోనే టాటా మోటార్స్‌ కూడా చేరాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రకటన విడుదల కానుంది. ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉండటం, వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుంది. భారీగా ధరలను పెంచేందుకు ముందుకు వస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News