Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsElectric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌...

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric bike | అందరిలా సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడి పోతే నా ప్రత్యేకత ఏంటి అనుకున్నాడు ఈ కరీంనగర్‌ యువకుడు. పెరిగిన ఇంధన ధరల వల్ల తండ్రి పడుతున్న కష్టాన్ని చూశాడు. తమ లాంటి పేదల కష్టాలను తీర్చేందుకు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ప్రతి సెకను ఆటో మొబైల్‌ రంగం పైనే తన దృష్టినంతా పెట్టాడు. ఓ సరికొత్త ఆవిష్కరణకు పునాది వేశాడు. ఓ పాత బండిని తన వద్ద ఉన్న పరికరాలతోనే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేశాడు.

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కాసం అఖిల్‌ రెడ్డి ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికాడు. తల్లిదండ్రులు కూడా చిన్నతనం నుంచి అతని కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. పంజాబ్‌ లోని లవ్లీ యూనివర్సిటీలో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ లో పట్టా పొందాడు. తన తండ్రి దూరంగా ఉన్న పొలానికి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను చూశాడు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన ధరల సమస్యలు చూసి బ్యాటరీ తో నడిచే వాహనాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తాను కొత్త వాహనం తయారు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది అనుకొని తన ఇంట్లోనే మూలన పడి ఉన్న హీరో హోండా స్ల్పెండర్ బైక్‌ ను తన నూతన ఆవిష్కరణకు ప్రధాన వస్తువుగా మార్చుకున్నాడు.

దానికి 4.8 కిలో వాట్ల మోటారు, కంట్రోలర్‌, ఓ కన్వర్టర్‌ తో పాటు స్పీడో మీటర్‌ ను బిగించి ఎలక్ట్రిక్‌ బైక్‌ గా మార్చేశాడు. గరిష్ట వేగం 70 కిలోమీటర్లుగా ఈ వాహనాన్ని తయారు చేశాడు.
అధిక వేడిని, మంటను తట్టుకునేలా దానికి కొన్ని పరీక్షలు నిర్వహించాడు. అందుకోసం మూడు రోజుల పాటు తన గ్రామానికి సమీపంలో ఉన్న కొండ వద్ద దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎండలోనే ఉంచాడు. అప్పుడు దానిలో వచ్చిన సమస్యలను గుర్తించి కొన్ని మార్పులను చేశాడు. చలి, వర్షం లో కూడా వాహనాల్లో వస్తున్న మార్పులను గమనించి అవసరమైన మార్పులు చేర్పులు చేశాడు. ఈ బైక్ మీద 18 నెలలుగా వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే దీని కోసం రూ.1.3 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. దీనికి ఐదు గంటలు ఛార్జీంగ్‌ పెడితే 180 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపాడు. కరెంట్‌ కూడా తక్కువే అవుతుందని వివరించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News