Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsHOP Leo | ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. లక్షలోపే వస్తున్న ఎలక్ట్రిక్‌...

HOP Leo | ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. లక్షలోపే వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

HOP Leo | ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొనాలని ఉన్నప్పటికీ ఛార్జింగ్‌ సమస్యతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ హాప్‌ ( HOP) సరికొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న హాప్‌ లియో మోడల్‌లో హై స్పీడ్‌ వేరియంట్‌ను తీసుకొచ్చింది.

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గరిష్ఠంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇందులో 2.1KWh లిథియం అయాన్‌ బ్యాటరీని వినియోగించారు. దీనివల్ల దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణించగలదు. దీన్ని ఛార్జ్‌ చేయడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. 850 w స్మార్ట్‌ చార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం రెండున్నర గంటల్లోనే 80 శాతం వరకు ఛార్జ్‌ చేయవచ్చు. దీని ధర సుమారు రూ.97 వేలు ( ఎక్స్‌ షోరూం ) గా నిర్ణయించారు.

మరిన్ని ఫీచర్లు

✬ హాప్‌ లియో హైస్పీడ్‌ వేరియంట్‌లో నాలుగు మోడ్స్‌ ఉన్నాయి. ఎకో, పవర్‌, స్పోర్ట్స్‌ మోడ్స్‌తో పాటు రివర్స్‌ మోడ్‌ కూడా ఉంది.

✬ ఈ స్కూటర్‌ ముందు, వెనుక భాగంలో 10 అంగుళాల టైర్లు ఉన్నాయి. దీని గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 160మి.మీలుగా ఉంది. ఇది 160 కేజీల వరకు బరువును మోయగలవు.

✬ హాప్‌ లియో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో సస్పెన్షన్‌ సెటప్‌ బాగుంది. దీని ముందు భాగంలో నిటారుగా ఉండే టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక సస్పెన్షన్‌ హైడ్రాలిక్ స్ప్రింగ్‌ లోడెడ్‌ షాక్‌ అబ్జార్బర్‌ ఉన్నాయి.

✬ ఇందులో ముందు, వెనక కలిపి కాంబి- బ్రేక్‌ సిస్టమ్‌ ఉంది. అలాగే రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంది.

✬ ఈ బైక్‌లో ఎల్‌సీడీ డిజిటల్‌ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి కనెక్టివిటీ ఫీచర్‌ లేదు. కానీ థర్డ్‌ పార్టీ జీపీఎస్‌ ట్రాకర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే సదుపాయం ఉంది.

✬ వైట్‌, బ్లాక్‌, గ్రే, బ్లూ, రెడ్‌ కలర్స్‌లో హాప్‌ లియో హైస్పీడ్‌ వేరియంట్ అందుబాటులో ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Maruti Suzuki Jimny | ఈ కారుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. డిమాండ్ చూసి బుకింగ్ అమౌంట్ రెట్టింపు చేసేసిన మారుతి సుజుకీ

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News