Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsBBC Documentary row | ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ…. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

BBC Documentary row | ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ…. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

BBC Documentary row | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్ ( BBC ) తీసిన డ్యాకుమెంటరీ వివాదాలకు దారి తీసింది. దీని పై కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఏ లింకులైనానే సరే సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాడానికి వీలు లేదని ఆదేశించింది.

మోదీపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను వెంటనే సోషల్‌ మీడియా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. య్యూట్యూబ్‌, ట్విట్టర్ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలకు దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇండియా: ది మోదీ క్వశ్చన్‌ అనే పేరుతో బీబీసీ రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

2002 లో గుజరాత్‌ లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంపై బీబీసీ తన డాక్యుమెంటరీలో పలు విమర్శలు చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని అపఖ్యాతి పాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. ఇందులో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించింది.

దీంతో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు కూడా. కానీ ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్‌ లోడ్‌ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్‌ చేసినా లేదంటే వీడియో లింకుల్ని షేర్‌ చేసినా, వాటిని వెంటనే బ్లాక్‌ చేయాలని సోషల్‌ మీడియా సంస్థల్ని ప్రభుత్వం ఆదేశించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Naga babu | ఏపీలో జనసేన పొత్తులపై మెగాబ్రదర్ కీలక వ్యాఖ్యలు.. పవన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్న నాగబాబు!

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News