Home Latest News Whatsapp Online Status | వాట్సాప్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్టు ఎవరికీ తెలియద్దంటే ఇలా చేయండి.

Whatsapp Online Status | వాట్సాప్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్టు ఎవరికీ తెలియద్దంటే ఇలా చేయండి.

Image by rawpixel.com on Freepik

Whatsapp Online Status | వాట్సాప్‌ యూజర్లు చాలామంది తమ లాస్ట్‌ సీన్‌ ఆఫ్‌ చేసి పెట్టుకుంటారు. దీనికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది. తమ బాస్‌కు తెలివకూడదని కొందరు.. ఫ్రెండ్స్‌ చూడకూడదని మరికొందరు.. పేరెంట్స్‌కు కనిపించవద్దని ఇంకొందరు తమ లాస్ట్‌ సీన్‌ స్టేటస్‌ ఆఫ్‌ చేసిపెట్టుకుంటారు. దీనివల్ల చివరగా ఎప్పుడు వాట్సాప్‌ ఓపెన్‌ చేశామనే విషయం అవతలి వ్యక్తులకు తెలియదు. కానీ మనం ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మాత్రం వాళ్లకు తెలిసిపోతుంది. లాస్ట్‌ సీన్‌ ఆఫ్‌ చేసినా సరే ఎప్పుడైతే వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తామో.. అప్పుడు వాళ్లకు మనం ఆన్‌లైన్‌లోనే ఉన్నామని చూపిస్తుంది. అలా మీరు అలా ఆన్‌లైన్‌లో ఉన్నట్టు కనిపించకుండా సెట్‌ చేసుకోవచ్చు.

అదేంటి.. ఆన్‌లైన్‌లో ఉన్నట్టు ఎవరికీ కనబడకుండా సెట్‌ చేసుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌నే ప్రవేశపెట్టింది. లేటెస్ట్‌ అప్‌డేట్‌లో దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్‌ లేటెస్ట్‌ వర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ప్రైవసీ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. ప్రైవసీ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయగానే లాస్ట్‌ సీన్‌ & ఆన్‌లైన్‌ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి ముందు లాస్ట్‌ సీన్‌ ఎవరు చూడాలి అనేది సెలెక్ట్‌ చేసుకోవాలి. దాని కింద మీరు ఆన్‌లైన్‌లో ఉన్నది ఎవరు చూడాలని అనుకుంటున్నారో సెలెక్ట్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ వన్‌, సేమ్‌ యాస్‌ లాస్ట్‌ సీన్‌ అనే రెండు ఆప్షన్‌ను ఉంటాయి. దానిలో రెండో ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. మీ లాస్ట్‌ సీన్‌ ఎవరూ చూడకూడదని సెలెక్ట్‌ చేసుకుంటే.. మీరు ఆన్‌లైన్‌లో ఉన్న సంగతి కూడా ఎవరికీ కనిపించదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

find your twin | అచ్చం మీలాగే మరో వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఉందా?

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Whatsapp | వాట్సాప్ లో ఉన్న ఈ లిమిటేషన్స్ గురించి ఈ విషయాలు తెలుసా

chatGPT | చాట్‌జీపీటీ కలకలం.. ఈ యాప్ మీ ఫోన్‌‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Exit mobile version