Home Latest News chatGPT | చాట్‌జీపీటీ కలకలం.. ఈ యాప్ మీ ఫోన్‌‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

chatGPT | చాట్‌జీపీటీ కలకలం.. ఈ యాప్ మీ ఫోన్‌‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Image Source: techmethink website

chatGPT | ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే ఈ చాట్ జీపీటీ గూగుల్‌కు కూడా ముచ్చెమటలు పట్టించింది. ఈ ఏఐకి వస్తున్న ఆదరణను చూస్తుంటే కొద్దిరోజుల్లోనే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందేమోనని గూగుల్‌నే భయపడేలా చేసింది. అంటే ఈ చాట్ జీపీటీ ఎంతటి ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు కుట్రలు పన్నుతున్నారు. చాట్ జీపీటీ పేరుతో నకిలీ యాప్‌లను తీసుకొచ్చి జనాల నుంచి సొమ్ములు గుంజేందుకు యత్నిస్తున్నారు.

ఇప్పటికే చాట్ జీపీటీ ఏఐ విత్ జీపీటీ 3 పేరుతో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ యాప్‌లను పెట్టేశారు. అదనపు ఫీచర్లు కావాలంటే 49.99 డాలర్ల ఫీజు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఈ యాప్‌ను వేలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. పలువురు 49.99 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ కూడా తీసుకున్నారు. అయితే ఫేక్ యాప్స్‌పై కన్నేసిన గూగుల్, యాపిల్ సంస్థలు తమ యాప్ స్టోర్స్ నుంచి నకిలీ యాప్‌ను తొలగించాయి. చాట్ జీపీటీ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని.. యాప్ స్టోర్స్‌లో ఆ పేరుతో ఏవైనా యాప్స్ కనిపిస్తే రిపోర్టు చేయాలని సూచించాయి. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.

ప్లే స్టోర్‌లో ఉన్న నకిలీ చాట్ జీపీటీ యాప్స్

GPT AI Chat – Chatbot Assistant
ChatGPT3 : chat GPT AI
Talk GPT – Talk to ChatGPT
GPT Writing Assistant, AI Chat
PersonAI – Advanced chatbot

సబ్‌స్క్రిప్షన్ దిశగా చాట్ జీపీటీ యోచనలు !

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్‌ఏఐ అనే సంస్థ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చాట్ జీపీటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. దీనికి జనాల్లో ఆదరణ కూడా విపరీతంగా వస్తుంది. కేవలం రెండు వారాల్లోనే 10 లక్షల మంది యూజర్లు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ నిర్వహణ ముందు ఊహించిన దానికంటే అదనపు భారంగా మారిందని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ వెల్లడించారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ట్విట్టర్ తరహాలో చాట్ జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

Twitter | ఇకపై ఎంత పెద్ద సైజు ట్వీట్స్ అయినా చేయవచ్చు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు ప్రకటించిన ఎలన్ మస్క్

Exit mobile version