Home Business Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Google | ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీ అయిపోయింది. మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. తీసివేయాలనుకుంటున్న ఉద్యోగులకు ఇప్పటికే సందేశాలను మెయిల్స్‌ పంపినట్లు తెలిపింది.

ఈ విషయాన్ని గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్​ స్వయంగా కంపెనీ వెబ్​సైట్​ ద్వారా వెల్లడించారు. ఆర్థిక సంక్షోభం భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా భారీగా నియామకాలు చేపట్టాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గూగుల్​, ఆల్ఫాబెట్​లోని పలు విభాగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడం, మూలధనం వృద్ధి వంటి విషయాలపై ప్రస్తుతం దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కఠిన నిర్ణయానికి తనదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ కోతలు ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఉద్యోగులను తాను క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాప్ట్ కూడా తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!

Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు జీతాలివ్వొచ్చట.. ఆక్స్‌ఫామ్ నివేదిక

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

Refrigerator prices may hike | కొత్త సంవత్సరంలో సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Exit mobile version