Home News International find your twin | అచ్చం మీలాగే మరో వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఉందా?

find your twin | అచ్చం మీలాగే మరో వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఉందా?

Image source : Youtube/twinstrangers.com

find your twin | సల్మాన్‌ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌, కత్రినా కైఫ్ ఇలా చాలామంది సెలబ్రెటీలను పోలిన వ్యక్తుల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. అవి విన్నప్పుడు వాళ్లలాగే మన పోలికలతో కూడా ఉన్న వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా అనే సందేహం వస్తుంటుంది. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు.. కాబట్టి మనల్ని పోలిన వాళ్లు కూడా ఎక్కడో ఉండొచ్చు. కానీ వాళ్లను ఎలా కనుక్కోవడం. సెలబ్రెటీలు అంటే ఫేమస్‌ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్లను ఎవరో ఒకరు గుర్తిస్తారు. మనలాంటి సామాన్యులు ఎలా కనిపెట్టాలి? ఒకప్పుడు అయితే ఇది కష్టమేమో కానీ.. ఇప్పుడైతే కాదు! అచ్చం మనలాగే ఉన్న వ్యక్తిని కనుక్కునేందుకు ఓ వెబ్‌సైట్‌ ఉంది.

ఎలా కనుక్కోవచ్చు?

మనలాగే ఉన్న మరో వ్యక్తిని కలుసుకునేందుకు twinstrangers.com అనే వెబ్‌సైట్‌ ఉంది. ఈ వెబ్‌సైట్‌ గురించి తెలిసిన అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జెన్నీఫర్‌ తనలా ఉండే మరో వ్యక్తి కోసం ఈ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసింది. అప్పుడు ఆమెకు నార్త్‌ కరోలినాకు చెందిన ఆంబ్రా గురించి తెలిసింది. ఆంబ్రా అచ్చం తనలాగే ఉండటంతో ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ పోస్టు వైరల్‌ కావడంతో ఈ వెబ్‌సైట్‌ గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది.

మనం ఏం చేయాలి?

మీ పోలికలతోనే ఉన్న వ్యక్తిని గుర్తించాలంటే ముందుగా ట్విన్‌ స్ట్రేంజర్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. తర్వాత మన ఫొటోను అందులో అప్‌లోడ్‌ చేయాలి. అప్‌లోడ్‌ చేసే ఫొటోలో మన ముఖ కవళికలు సరిగ్గా ఉండాలి. ఒకవైపు తిరిగినట్టుగా ఉండే ఫొటోలకు బదులు.. ఫేస్‌ స్ట్రెయిట్‌గా ఉన్న ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. అందులో మన మొహం స్పష్టంగా కనిపించాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అన్నీ స్పష్టంగా కనిపించే ఫొటోలనే ఎంచుకోవాలి. ఇలా ఐదు రకాల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత పేరు, ఊరు, దేశం, జెండర్‌ తదితర వివరాల్ని సబ్‌మిట్‌ చేయాలి.

ఈ వెబ్‌సైట్‌ ఎలా పనిచేస్తుంది.

ఫొటోతో పాటు అన్ని వివరాలను సబ్‌మిట్‌ చేసిన తర్వాత మన పోలికలతో ఉన్న వ్యక్తుల కోసం సెర్చ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము చెల్లించిన తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో మన ప్రొఫైల్‌కు రిలేటెడ్‌గా ఉన్న ప్రొఫైల్స్‌ను వెతుకుతుంది. అందులో మనకు రిలేటెడ్‌గా ఉన్న వాటిని ఒక ఫోల్డర్‌లోకి పంపిస్తుంది. వాటిని చెక్‌ చేసి అచ్చం మనలాగే ఉన్న వ్యక్తులను దొరకపట్టవచ్చు. అలా ఎవరైనా దొరకితే ఆ ప్రొఫైల్‌ను మై ట్విన్స్‌ ఫోల్డర్‌లోకి పంపించాలి. అప్పుడు వాళ్లతో పరిచయం పెంచుకునేందుకు వీలవుతుంది. ఒకవేళ మీ పోలికలతో ఉన్న వ్యక్తి దొరక్కపోతే దిగులు చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇది కేవలం తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయిన ప్రొఫైల్స్‌ను మాత్రమే చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ వెబ్‌సైట్‌లో కోటి మంది వరకు రిజిస్టర్‌ అయ్యారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IB Recruitment 2023 | పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Preliminary key | పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల.. మొత్తం 6,100 పోస్టులు!

Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Exit mobile version