Home Entertainment Shaakuntalam | అమ్మో.. శాకుంతలం సినిమాలో సమంత ధరించిన నగల ధర అన్ని కోట్లా?

Shaakuntalam | అమ్మో.. శాకుంతలం సినిమాలో సమంత ధరించిన నగల ధర అన్ని కోట్లా?

Shaakuntalam | సమంత నటించిన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా చక్కటి పౌరాణిక ప్రేమ కావ్యంగా ఈ చిత్రాన్ని మలిచాడు డైరెక్టర్‌ గుణశేఖర్‌. రుద్రమదేవి తర్వాత ఈయన నుంచి వస్తున్న ఎపిక్‌ స్టోరీ కావడం.. సమంత వంటి స్టార్ హీరోయిన్‌ నటించడంతో ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కానీ షూటింగ్‌ పూర్తయ్యేదాకా సినిమా గురించి ఒక్క విషయాన్ని కూడా లీక్ కానివ్వలేదు. సమంత లుక్‌ లీక్‌ కాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ దగ్గరికి వస్తుండటంతో సినిమా ప్రమోషన్‌పై ఫోకస్‌ పెట్టిన గుణశేఖర్‌ రోజురోజుకీ సినిమాపై హైప్‌ పెంచేస్తున్నాడు.

ముందుగా శాకుంతలం సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగానే దానికి మంచి బజ్‌ వచ్చింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పౌరాణిక ప్రేమ కావ్యాన్ని గుణశేఖర్‌ అత్యంత సుందరంగా తెరకెక్కించి ఉంటారని అంతా ఫిక్సయిపోయారు. రీసెంట్‌గా మల్లికా మల్లికా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. ముఖ్యంగా సమంత కట్టుకున్న చీర, వేసుకున్న నగలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి గురించి నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.

శాకుంతలంలో సమంత పాత్ర కోసం డైరెక్టర్‌ గుణశేఖర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్ట్యూమ్స్‌తో పాటు వేసుకునే ఆభరణాల విషయంలోనూ చాలా కేర్‌ తీసుకున్నాడు. ఇందులో భాగంగానే షూటింగ్‌ కోసం నిజమైన నగలనే ఉపయోగించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల దుకాణం ఈ నగలను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించింది. ఈ నగల విలువ దాదాపు రూ.3కోట్లపైనే ఉంటాయని సమాచారం. అలాగే ఈ సినిమా కోసం సమంత ఏకంగా 30 కిలోల బరువు ఉండే చీరను కట్టుకుంది. ఒరిజినల్‌ ముత్యాలు పొదిగి ఈ శారీని తయారు చేశారట. ఈ చీరతో ఏడు రోజుల పాటు షూటింగ్‌ చేశారు. ఈ విషయం ఇప్పుడు ఫిలిం వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Exit mobile version