Home Latest News Yashasvi Jaiswal | దంచికొట్టిన పానీపూరి కుర్రోడు.. డబుల్‌ సెంచరీతో విజృంభణ

Yashasvi Jaiswal | దంచికొట్టిన పానీపూరి కుర్రోడు.. డబుల్‌ సెంచరీతో విజృంభణ

Yashasvi Jaiswal | టైమ్‌ 2 న్యూస్‌, గ్వాలియర్‌: పసితనం నుంచి క్రికెటే ఆశగా.. శ్వాసగా పెరిగిన ఆ కుర్రాడు.. వచ్చిన అవకాశలను చక్కగా వినియోగించుకుంటున్నాడు. వెలుగులోకి రావడానికి ముందు పొట్టకూటి కోసం పానీపూరీలు అమ్మిన ఆ చిన్నోడు.. ప్రపంచకప్‌లో భారత్‌ అండర్‌-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్‌కు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆ యువ కెరటమే యశస్వి జైస్వాల్‌. ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్న యశస్వి జైస్వాల్‌.. ఇరానీ కప్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గ్వాలియర్‌ వేదికగా జరుగుతున్న పోరులో 259 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్‌ 213 పరుగులు చేశాడు. ఇందులో 30 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి యశస్వితో పాటు అభిమన్యు ఈశ్వరన్‌ (240 బంతుల్లో 154; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగడంతో బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్‌ ఇండియా 87 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

అసలేంటీ ఇరానీ మ్యాచ్‌..

భారత దేశవాళీ సీజన్‌లో ఇరానీ మ్యాచ్‌ను చివరి మ్యాచ్‌గా పరిగణిస్తారు. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టుతో.. మిగిలిన ప్లేయర్లంతా కలిసి పోటీ పడతారు. 2022 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు విజేతగా నిలువడంతో ఇరానీకప్‌లో రెస్టాఫ్‌ ఇండియాతో తలపడుతోంది. రెస్టాఫ్‌ ఇండియా టీమ్‌కు మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యం వహిస్తుండగా.. గాయం కారణంగా స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేయాలని బలంగా భావిస్తున్న మయాంక్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తాజా రంజీ సీజన్‌లో తొమ్మిదొందలకు పైగా పరుగులు చేసి ఫుల్‌ ఫామ్‌లో ఉన్న అగర్వాల్‌.. కీలక పోరులో 2 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దీంతో 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన రెస్టాఫ్‌ ఇండియా జట్టును అభిమన్యు, యశస్వి ఆదుకున్నారు. వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించారు. అవేశ్‌ ఖాన్‌, కుమార్‌ కార్తికేయ సహా మధ్యప్రదేశ్‌ బౌలర్లంతా వీరి జోరుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. రెండో వికెట్‌కు 371 పరుగులు జోడించారు. అయితే మరికాసేపట్లో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. వరస బంతుల్లో వీరిద్దరూ ఔటవడంతో మధ్యప్రదేశ్‌ ఊపిరి పీల్చుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | అగ్రస్థానానికి భారత ఆఫ్‌ స్పిన్నర్‌.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌

Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్ మెస్సీ

NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

Exit mobile version