Home Latest News Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

Sachin Tendulkar | టైమ్ 2 న్యూస్, ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. రెండు దశాబ్దాలకు పైగా తన అసమాన ప్రతిభతో క్రీడాభిమానులను అలరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ముంబై వీధుల్లో ఆట ప్రారంభించి.. విశ్వమంతా వ్యాపించిన మాస్టర్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ సమున్నత స్థాయిలో గౌరవించాలనే ఉద్దేశంతో ఈ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం వివరాలు వెల్లడించాడు. వాంఖడే స్టేడియంలో ఓ క్రికెటర్‌కు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏప్రిల్ 24తో 50వ పడిలోకి అడుగుపెట్టనున్న సచిన్ టెండూల్కర్.. ఆమెదంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నాడు. మంగళవారం వాంఖడే కు విచ్చేసిన క్రికెట్ దిగ్గజం.. ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది. నా జీవితంలోని ఎన్నో మధుర ఘట్టాలకు వాంఖడే వేదికైంది. దేశవాళీల్లో తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడా. ఆ తర్వాత 2011లో నా చిరకాల స్వప్నమైన వన్డే ప్రపంచకప్‌ను ఇక్కడే దక్కించుకున్నా.. ఇక కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ కూడా ఇక్కడే ఆడా. ఇలా నా కెరీర్‌కు వాంఖడే మైదానానికి విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్లేస్‌ల్లో నా విగ్రహం ఏర్పాటు చేయనుండటం ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధులు ఈ విషయం చెప్పినపుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యా. ముంబై సంఘంతో నా అనుబంధం సుదీర్ఘమైంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి చర్యలతో వాళ్లు నాపైన ఉన్న ప్రేమను చాటాలనుకుంటున్నారు’ అని పేర్కొన్నాడు.

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న మాస్టర్ టెస్టు క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన మాస్టర్.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా ఘనత సాధించాడు. ఇప్పటికే లండన్లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సచిన్ మైనపు ప్రతిమ ఉండగా.. తాజాగా వాంఖడేలో దాన్ని తలదన్నే విధంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. ఆ సమయంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నది.

చివరగా.. 2011లో భారత ఉపఖండంలో వరల్డ్ కప్ జరిగింది. మహేంద్రం సింగ్ ధోనీ నేతృత్వంలో బరిలోకి దిగిన టీమిండియా.. అన్ని అడ్డంకులు దాటుకొని ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పటి వరకు 6సార్లు ప్రపంచకప్ బరిలోకి దిగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరి ప్రయత్నంలో కప్పు చేజిక్కించుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version